లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

తెలంగాణ‌లో కొత్త‌గా 214 క‌రోనా కేసులు, ఇద్దరు మృతి

Updated On - 1:12 pm, Fri, 22 January 21

214 new corona cases registered in Telangana : తెలంగాణ‌లో కొత్త‌గా 214 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో వైరస్ బారిన పడి ఇద్ద‌రు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం (జనవరి 22, 2021) వెల్ల‌డించింది. రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,586కు చేరింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,835కు చేరింది. కరోనా నుంచి కోలుకుని నిన్న 351 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,87,468కి చేరింది.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3,781 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 2,178 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 38 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.