Covid-19 Second Wave : తెలంగాణలో అదుపులోనే కరోనా.. 2 డోసులిచ్చినా మళ్లీ కోవిడ్ వచ్చింది..

ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడినవారందరికి వ్యాక్సిన్ ఇస్తామని టీఎస్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 80ఏళ్ల వ్యక్తికి మళ్లీ కోవిడ్ వచ్చిందన్నారు. కానీ, అతడిలో చాలావరకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు.

Covid-19 Second Wave : తెలంగాణలో అదుపులోనే కరోనా.. 2 డోసులిచ్చినా మళ్లీ కోవిడ్ వచ్చింది..

Corona Ts

Covid-19 Second Wave : తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. అప్రమత్తంగా ఉండటంతో రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగామని అన్నారు. గత మార్చి నుంచి ఇప్పటివరకూ కోటికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు.

తెలంగాణలో పాజిటివ్ రేటు 0.6 శాతం నమోదైందని డీహెచ్ తెలిపారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలైందని, ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. వ్యాక్సినేషన్ లో ప్రజల నుంచి స్పందన తక్కువగా ఉందన్నారు.

ఇప్పటివరకూ 12 లక్షల టీకాలు వేశామని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడినవారందరికి వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్నారు. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 80ఏళ్ల వ్యక్తికి మళ్లీ కోవిడ్ వచ్చిందన్నారు.

కానీ, అతడిలో చాలావరకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని టీఎస్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. లంగ్స్ పూర్తిగా క్లియర్ గా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. హోలి పండుగ రోజున జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు.