అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే.. మహిళపై యాసిడ్ దాడి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుగుతున్న సమయంలోనే మెదక్ జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. అల్లాదుర్గం మండలం గడి పెద్దపూర్‌లో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే.. మహిళపై యాసిడ్ దాడి

acid-attack-on-2-women

Acid attack on a woman : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుగుతున్న సమయంలోనే మెదక్ జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. అల్లాదుర్గం మండలం గడి పెద్దపూర్‌లో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. మల్కాపూర్ తండాకు చెందిన 40 ఏళ్ల ఆలవత్ చత్రుబాయ్‌ అనే మహిళపై దుండగులు యాసిడ్ దాడి చేశారు.

ప్రస్తుతం బాధిత మహిళ హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జోగిపేట సంతకు వచ్చిన మహిళ నిన్న సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆ తరువాత ఆమెపై యాసిడ్ దాడి జరిగింది.

ఆటో డ్రైవర్ ఇంటి ముందు గాయాలతో పడి ఉన్న తక్రిబాయ్‌ను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.