CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు.

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Cm Kcr

CM KCR : తెలంగాణలో పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సభ్యులుగా ఉంటారు.

కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని ఒత్తిడి ఏ మేరకు ఉందో గుర్తించడం, కొత్తగా ఉద్యోగాల అవసరాన్ని అంచనా వేయడం ఈ కమిటీ విధి. ఆయా ప్రభుత్వ శాఖలు తమ పనితీరు మెరుగుపర్చుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఈ కమిటీ నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. వీఆర్ఓలు, వీఆర్ఏల సేవలను ఏ రీతిలో ఉపయోగించుకోవాలన్నది కూడా ఈ పరిపాలన సంస్కరణల కమిటీ అధ్యయనం చేయనుంది.

Eating Egg : రోజూ కోడి గుడ్డు తింటే మధుమేహం ముప్పు

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్న సీఎం కేసీఆర్.. పరిపాలన సంస్కరణల పరంగానూ మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వైద్య ఆరోగ్య, పురపాలక, విద్య, పంచాయతీరాజ్ వంటి ప్రధాన శాఖల పనితీరు మెరుగుపర్చడం, ఉద్యోగుల సేవల వినియోగం, మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాల్లో ఐఏఎస్ అధికారుల కమిటీ తగు సూచనలు చేయాలని కేసీఆర్ నిర్దేశించారు.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో పరిపాలన సంస్కరణల దిశగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాగా, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిందని.. ఇప్పటివరకు 38వేల 643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా 101 మంది మినహా 38వేల 542 మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో చేరిపోయారని అధికారులు సీఎంకి వివరించారు. ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ, పోలీసు కార్యాలయాల నిర్మాణం, జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, మరింత మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక అందించాలని కమిటీకి సూచించారు సీఎం కేసీఆర్. అలాగే పలు శాఖల్లో కొత్త పోస్టులు, సాంకేతిక అవసరాలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది.