వీడు మాములోడు కాదు, కనుబొమ్మలు గీకేసుకుని కోట్లు కొట్టేశాడు

వీడు మాములోడు కాదు, కనుబొమ్మలు గీకేసుకుని కోట్లు కొట్టేశాడు

Babu Rao High Tech Fraud: వాటాల ఆశలు చూపిస్తాడు. ఇంటీరియర్ కంపెనీలో సరుకులు కావాలంటాడు. మినరల్ వాటర్ వ్యాపారంలో పార్టనర్ షిప్ ఇస్తానంటాడు. చివరికి పంగనామాలు పెట్టి నిండా ముంచేస్తాడు. డబ్బులు తిరిగి అడిగితే భార్యను రంగంలోకి దించుతాడు. పోలీసులు ఎంటర్ అయితే తప్పించుకోవడానికి వింత వేషాలు వేస్తాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఓ కేటుగాడి కథామిషు ఇది. ఊర్లు మారుస్తూ వ్యాపారస్తులను మోసగిస్తున్న నేరగాడి హిస్టరీ ఇది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బాబూరావు చూడటానికి బిజినెస్ మ్యాన్ లా బిల్డప్ లు ఇస్తూ ఉంటాడు. కానీ, వ్యాపారస్తులను మోసం చేస్తూ ఉంటాడు. మంచి నీళ్లు తాగినంత ఈజీగా వందలాది మందిని చీట్ చేశాడు. మాటలతో మాయ చేసి కోట్ల రూపాయలకు టోపీ పెట్టేస్తాడు. ముందుగా మంచిగా పరిచయం చేసుకుంటాడు. ఇంటీరియర్ కంపెనీ కోసం సరుకులు కావాలంటాడు. సరుకు చేతిలో పడగానే జెండా ఎత్తేస్తాడు.

మినరల్ వాటర్ కంపెనీలో వాటా ఇస్తానని ఆశ కూడా పెడతాడు. డబ్బు చేతికి అందే వరకు వారిని ఆకాశానికి ఎత్తేస్తాడు. అమౌంట్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యిందా ఇక మనోడు వేషాలు షురూ చేస్తాడు. రేపు మాపు అంటూ నెలలు గడుపుతాడు. చివరికి ఎదురుతిరిగిన వారిపైనే బ్లాక్ మెయిల్ కు దిగుతాడు. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన వెంటనే భార్యను సీన్ లోకి దించేస్తాడు. మనీ అడిగిన వారిపై తన భార్యతో లైంగిక వేధింపుల కేసు పెట్టిస్తానని భయపెడతాడు. మరోసారి తన జోలికి వస్తే పోలీసు కేసులు తప్పవని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఊరుకుంటే సరి, లేదంటే అన్నంత పని చేస్తాడీ నీచుడు. ఇలా వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలను దోచుకున్నాడు.

మరో విధంగానూ తప్పించుకుని తిరుగుతాడు బాబూరావు. అప్పు ఇచ్చిన వారు గుర్తు పట్టకుండా వేషాలను మార్చేస్తాడు. గడ్డం స్టైల్ చేంజ్ చేస్తాడు. కనుబొమ్మలు గీయించేస్తాడు. విలక్షణ నటుడు కమల్ హాసన్ ను మించిన వేషధారణతో అప్పు ఇచ్చిన వారికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతాడు. దోచిన డబ్బుతో దేశ, విదేశాల్లో ఎంజాయ్ చేస్తాడు.

కొన్నేళ్లుగా మకాం మారుస్తూ డబ్బు దోచుకుంటున్నాడు ఈ కేటుగాడు. నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ సీసీఎస్, సీఐడీ.. విజయవాడ, గుంటూరు పోలీస్ స్టేషన్లలో ఈ చీటర్ పై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కొన్నిసార్లు పోలీసులకు చిక్కినా బెయిల్ పై బయటకు వచ్చి తన మోస వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. నాన్ బెయిలబుల్ కేసు నమోదైనా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. వందలాది మందిని బురిడీ కొట్టించిన బాబూరావు బాధితుల లిస్టు చాంతాండంత ఉంది. బాబూరావుని కఠినంగా శిక్షించాలని, తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.