Bandi Sanjay : కేసీఆర్‌ను సన్మానించేందుకు శాలువా తెచ్చా : బండి సంజయ్

ప్రధాని సభకు కేసీఆర్ వస్తే సన్మానం చేయటానికి శాలువా తెచ్చాను కానీ ఆయన రాలేదు అని తెలిపారు బండి సంజయ్. కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay : కేసీఆర్‌ను సన్మానించేందుకు శాలువా తెచ్చా : బండి సంజయ్

Bandi Sanjay criticizes KCR'

Bandi Sanjay : ప్రధాని మోదీ సికింద్రాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో శనివారం ఏర్పాటు చేసిన సభకు సీఎం కేసీఆర్ కు పీఎంవో నుంచి ఆహ్వానం అందినా ఆయన హాజరు కాలేదు. పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఏర్పాటు చేసే సభలో సీఎం కేసీఆర్ మాట్లాడేందుకు టైమ్ కేటాయించింది పీఎంవో. కానీ సీఎం కేసీఆర్ హాజరుకాలేదు.

ఈ విషయంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘సభకు సీఎం కేసీఆర్ వస్తారని ఎదురు చూశాం కానీ ఆయన రాలేదు. ఆయన వస్తే సన్మానించటానికి శాలువా తెచ్చాన’ని తెలిపారు. ప్రధాని మోదీ సభకు కేసీఆర్ ఎందుకు రాలేదో, ఆయన షెడ్యూల్ ఏంటో బయటపెట్టాలని బండి డిమాండ్ చేశారు. ప్రధాని సభకు కూడా హాజరుకాలేనంత బిజీగా కేసీఆర్ ఉన్నారా, అంత ముఖ్యమైన పని ఏముందని ప్రశ్నించారు.

Also Read: తెలంగాణలో ఇక 24 గంటలు వ్యాపారాలు చేసుకోవచ్చు.. షరతులు వర్తిస్తాయి

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది.. కానీ ఈ రోజున తెలంగాణలో రూ.11 వేల కోట్లతో ప్రధాని మోడీ అభివృద్ధి పనులు చేపట్టిన ఈ విషయాన్ని గులాబీ ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు. సభకు రావాలని పీఎంవో నుంచి ఆహ్వానం అందినా కేసీఆర్ సభకు రాలేదని.. ఆయన కోసం తాను చాలా సేపు ఎదురు చూశానని చెప్పారు. ఆయన వస్తే సన్మానం చేద్దామని శాలువా కూడా తీసుకొచ్చానని అన్నారు.

PM Modi-CM KCR : ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్‌‌కు ఆహ్వానం .. గులాబీ బాస్ పాల్గొంటారా? లేదా?

కాగా ప్రధాని మోదీ తెలంగాణకు ఎప్పుడు వచ్చినా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న విమర్శలు, మాటల యుద్ధాలతో ప్రధానికి స్వాగతం పలకటానికి కూడా సీఎం కేసీఆర్ వెళ్లటం లేదు. దీంతో ప్రధాని వస్తే సీఎం స్థానంలో ఉన్న కేసీఆర్ ప్రొటోకాల్ పాటించటంలేదని విమర్శలు వస్తున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ మాత్రం ప్రధానికి స్వాగతం పలకటానికి హాజరుకావటంలేదు. అలాగే తెలంగాణ గవర్నర్ తమిళిసై విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్బీ, జేపీ మధ్య మాటల యుద్ధాలు.. విమర్శల దాడులు కొనసాగుతున్నాయి.