Jaggareddy: అడ్డుకున్నా సరే రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతాం: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

అనుమతి నిమిత్తం ఓయూకి బయలుదేరిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతామని అన్నారు

Jaggareddy: అడ్డుకున్నా సరే రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతాం: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Jagggu

Jaggareddy:  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సమావేశానికి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ సభను అడ్డుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతామని అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఓయూలో రాహుల్ గాంధీ పర్యటన కోసం న్యాయపరంగా ప్రయత్నాలు చేస్తున్నామని..మా ఓయూ జేఏసీ నేతలు మానవతా రాయ్ టీమ్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ న్యాయపరంగా పర్మిషన్ ఇవ్వకపోతే పీసీసీ, ఇంచార్జి ఠాగూర్ తో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జగ్గారెడ్డి అన్నారు.

Also Read:Chandrababu: ఆడబిడ్డల ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది?: మాజీ సీఎం చంద్రబాబు ట్వీట్

రాహుల్ గాంధీ ఓయూకి వస్తే యూనివర్సిటీలో ఉన్న సమస్యలు బయటికి వస్తాయనే, పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. “సీఎం కేసీఆర్ యూనివర్సిటీకి పోడు..రాహుల్ గాంధీని రానివ్వడు” అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ఎలాంటి రాజకీయం ఉండదని..పార్టీలకు అతీతంగా స్టూడెంట్స్‌తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలనే తమ ఆలోచన అని జగ్గారెడ్డి వివరించారు. మరొకసారి ఓయూ వైస్ ఛాన్సలర్ ని కలిసి సభ అనుమతి కోరనున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాగా అనుమతి నిమిత్తం ఓయూకి బయలుదేరిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు.

Also read:Chiranjeevi: సినీ కళాకారులు కాదు.. సినీ కళా కార్మికులు: మేడేలో మెగాస్టార్

మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేసిన వారిని పరామర్శించేందుకు ఆదివారం బంజారాహిల్స్ పీఎస్ కు వచ్చిన జగ్గారెడ్డి..అటునుంచి అటుగా ఓయూకి వెళ్తున్నానని చెప్పడంతో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కొంత నాటకీయ పరిణామాల అనంతరం జగ్గారెడ్డిని విడిచిపెట్టారు పోలీసులు. అయితే పీఎస్ కు వచ్చిన జగ్గారెడ్డిని పోలీసులు నిర్బందించడంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని రేవంత్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..ఉస్మానియా యూనివర్సిటీకి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also read:Hindu Country: హిమాలయాలు, హిందూ మహా సముద్రం మధ్య నివసించేవారందరు హిందువులే: కేంద్ర మంత్రి అశ్విని కుమార్‌

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత రాజ్యంలో ఉన్నామా అంటూ పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ..కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీల భిక్ష అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక పిరికి పాలకుడని..ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందని రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకున్నందుకు విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం దారుణమని, వారిని కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు నిర్బంధించడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు.

Also read:Raja Singh : ఆవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి-రాజాసింగ్