SriRama Navami: హైదరాబాద్ నగరంలో రెండు భారీ శోభాయాత్రలు: పాల్గొననున్న లక్షలాది మంది

భాగ్యనగరంలో రెండు భారీ శోభాయాత్రలు నిర్వహించనున్నారు. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక యాత్ర..బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో మరో యాత్ర

SriRama Navami: హైదరాబాద్ నగరంలో రెండు భారీ శోభాయాత్రలు: పాల్గొననున్న లక్షలాది మంది

Sobhayatra

SriRama Navami: దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కమనీయమైన సీత రాముల కళ్యాణం చూసేందుకు ఆదివారం ఉదయం నుంచే ప్రజలు ఆలయాలకు పోటెత్తారు. వాడవాడలు శ్రీరామ నామ స్మరణతో మార్మ్రోగిపోతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా భాగ్యనగరంలో రెండు భారీ శోభాయాత్రలు నిర్వహించనున్నారు. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక యాత్ర..బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో మరో యాత్ర నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్ళుగా హైదరాబాద్ నగరపరిధిలో శోభాయాత్ర నిర్వహించలేదు. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోనే ఉండడంతో ఈఏడాది భారీస్థాయిలో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భారీ శోభాయాత్రలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు.

Also read:Sriramanavami : శ్రీరామ శోభాయాత్ర.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు

నగరంలో అణువణువునా సీసీకెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు..శోభాయాత్ర నిర్వహించే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా యాత్ర వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర 01.00 గంలకు నగరంలోని సీతారాంబాగ్ నుండి ప్రారంభమౌతుండగా..రాజసింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర ఆశాశపురి హనుమాన్ మందిర్ నుంచి ఆదివారం 12.30 గంలకు ప్రారంభంకానుంది. రెండు యాత్రలు దూల్ పేట్ లో సర్కిల్ లో ఏకం కావడంతో మహా శోభాయాత్రగా మారి జాలీహనుమాన్, చుడీ బజార్, గౌలిగూడ మీదుగా హనుమాన్ టేకీడీలోని హనుమాన్ వ్యయమశాల వరకు సాగుతుంది. రాత్రి 10గంలకు హనుమాన్ వ్యాయామశాల వద్ద శోభాయాత్ర ముగియనుంది.

Also read:Bhadrachalam : సీతారాముల కల్యాణం చూతమురారండి.. ముఖ్యమైన ఘట్టాలివే