BJP MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాల్ని ప్రకటించిన బీజేపీ.. తెలంగాణలో ఒకరు… ఏపీలో ముగ్గురి పేర్లు ఖరారు

తెలంగాణలో రెండు, ఏపీలో మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణకు సంబంధించి ఒక టీచర్ల ఎమ్మెల్సీ స్థానం (ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్), ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి (హైదరాబాద్) ఎన్నికలు జరుగుతాయి.

BJP MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాల్ని ప్రకటించిన బీజేపీ.. తెలంగాణలో ఒకరు… ఏపీలో ముగ్గురి పేర్లు ఖరారు

BJP MLC Candidates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రెండు, ఏపీలో మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణకు సంబంధించి ఒక టీచర్ల ఎమ్మెల్సీ స్థానం (ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్), ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి (హైదరాబాద్) ఎన్నికలు జరుగుతాయి.

I-T Survey On BBC: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. ప్రతిపక్షాల ఆగ్రహం

ఏపీకి సంబంధించి మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు (ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానం, కడప – అనంతపురం – కర్నూలు గ్రాడ్యుయేట్ స్థానం, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం గ్రాడ్యుయేట్ స్థానం)తోపాటు, 2 టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు, 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు (అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు) ఎన్నికలు జరుగుతాయి. వీటిలో బీజేపీ తెలంగాణలో ఒక టీచర్ల స్థానానికి, ఏపీలో మూడు గ్రాడ్యుయేట్ల స్థానానికి అభ్యర్థులను కేటాయించింది.

MP Komatireddy Venkat Reddy : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

తెలంగాణలోని టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి ఎ వెంకట నారాయణ రెడ్డిని ఎంపిక చేయేగా, ఏపీలోని మూడు గ్రాడ్యుయేట్ల స్థానాలకు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, నాగరూరు రాఘవేంద్ర, పీవీఎన్ మాధన్‌ను బీజేపీ ఎంపిక చేసింది. ఇప్పటికే ఈ ఎన్నిలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ వెలువడుతుంది. అభ్యర్థుల నామినేషన్లకు ఫిబ్రవరి 23 చివరి తేదీకాగా, మార్చి 13న ఎన్నిక నిర్వహిస్తారు. మార్చి 16న ఫలితాలు వెలువడుతాయి. మిగతా స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్ని రెండు రాష్ట్రాల్లోనూ అధికార పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్ని స్థానాలను గెలవాలని ప్రయత్నిస్తున్నాయి.