Munugode Bypoll: ఈసీ ధ్రువీకరిస్తే.. మునుగోడులో నిలిచేది బీఆర్ఎస్ అభ్యర్థే..!

నవంబర్ 3న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుండగా, ఈనెల 14న నామినేషన్ల దాఖలుకు చివరితేదీ. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటయ్యే బీఆర్ఎస్‌కు ఆలోగా కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరణ లభిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Munugode Bypoll: ఈసీ ధ్రువీకరిస్తే.. మునుగోడులో నిలిచేది బీఆర్ఎస్ అభ్యర్థే..!

CM KCR

Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గం ఉప‌ఎన్నికలో విజయకేతనం ఎగురవేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఒకవైపు టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించే ప్రక్రియలో బిజీబిజీగా ఉంటూనే, మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉఫ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దసరా మరుసటి రోజు నుంచి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని షురూ చేసేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 86 యూనిట్లుగా విభజించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించారు.

CM KCR National Party: నేడే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. హాజరుకానున్న 283 మంది ప్రజాప్రతినిధులు

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను మండలాలు, గ్రామాల ఇన్‌చార్జీలుగా నియమించిన కేసీఆర్ తానుకూడా ఓ గ్రామానికి బాధ్యుడిగా వ్యవహరించనున్నారు. మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. కేసీఆర్ మార్గనిర్దేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డి బృందం అక్కడ ప్రచారం కార్యక్రమాలు నిర్వహించనుంది. మరోవైపు మత్రి కేటీఆర్ కు గట్టుప్పల్ మండల కేంద్రం యూనిట్‌కు, మంత్రి హరీష్ రావుకు మర్రిగూడ మండల కేంద్రం యూనిట్ కు ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

నవంబర్ 3న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుండగా, ఈనెల 14న నామినేషన్ల దాఖలుకు చివరితేదీ. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటయ్యే బీఆర్ఎస్ కు ఆలోగా కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరణ లభిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెరాస స్థానంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పు నిర్ణయంపై చేసిన తీర్మానం ప్రతితో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పార్టీ తెలంగాణ భవన్ కార్యాలయ ఇన్ ఛార్జి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ మార్పుపై చేసిన తీర్మానానికి ఆమోదం కోరుతూ అఫిడవిట్ సమర్పించనున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా లోపు ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే టీఆర్ఎస్ అభ్యర్థికాస్త.. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.