CM KCR : పోడు భూములు.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

పోడు భూముల అంశంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పరిష్కారంపై అధికారులకు సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలిచ్చారు. ఈ

CM KCR : పోడు భూములు.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

Cm Kcr

CM KCR : పోడు భూముల అంశంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పరిష్కారంపై అధికారులకు సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలిచ్చారు. ఈ నెల మూడో వారంలో కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాక.. ఒక్క గజం జాగ అటవీ భూమి భవిష్యత్తులో అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని, దురాక్రమణలు అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోదన్నారు. పోడు సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అవసరమైతే నేతలకు అటవీ భూములు అన్యాక్రాంతమైన విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. అటవీ పరిరక్షణ కమిటీలను నియమించేందుకు విధి విధానాలను తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

MAA Elections: నేను ప్రచారం ముగించి నాలుగు రోజులైంది.. అతనికి సిగ్గు లేదు -ప్రకాష్ రాజ్

అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవీ అంచున భూమిని కేటాయిస్తామన్నారు. అలా తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వ్యవసాయానికి నీటి సౌకర్యం, కరెంటు వంటి వసతులు కల్పించడంతో పాటు రైతుబంధు, బీమా పథకాలు వర్తింపజేస్తామన్నారు.

Manchu Vishnu: మేమే గెలుస్తున్నాం.. డిన్నర్ మీట్‌కి 500మంది వచ్చారు -మంచు విష్ణు

‘‘ మనిషి మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలు ఇస్తున్నాయి. బయో డైవర్సిటీ కూడా పెరిగింది. హరితహారం కార్యక్రమం ద్వారా సాధిస్తున్న ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరిత నిధికి విశేష స్పందన వస్తోంది.

అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోడుభూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలి. దరఖాస్తుల్లో తెలిపిన అంశాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా చర్యలు చేపట్టాలి’’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.