CM KCR Gandhi : గాంధీలో సీఎం కేసీఆర్.. కరోనా రోగులకు పరామర్శ, వారికి అభినందనలు

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, ధైర్యంగా ఉండాలని వారికి చెప్పారు. వారిని అడిగి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

CM KCR Gandhi : గాంధీలో సీఎం కేసీఆర్.. కరోనా రోగులకు పరామర్శ, వారికి అభినందనలు

Cm Kcr Gandhi

CM KCR Visits Gandhi : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, ధైర్యంగా ఉండాలని వారికి చెప్పారు. వారిని అడిగి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. దాదాపు 40 నిమిషాల పాటు గాంధీ ఆసుపత్రిలో ఉన్న సీఎం కేసీఆర్.. కరోనా చికిత్స ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. కాగా, సీఎం హోదాలో గాంధీ ఆసుపత్రిని కేసీఆర్ సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వైద్య ఆరోగ్య, శాఖ బాధ్యతలను కేసీఆర్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్య చికిత్సపై ప్రధానంగా చర్చించారు. ఆసుపత్రిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి? వెంటిలేటర్ పరిస్థితి, ఆక్సిజన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఆవరణలో రసాయనాలు పిచికారీ చేయడంతో పాుటు రోగుల బంధవులను అక్కడి నుంచి తరలించారు.