Telangana : తెలంగాణ ప్రజలకు చల్లని కబురు

Telangana : జూన్ 3వ వారం నాటికి నైరుతి రుతుపవనాలు తీరం దాటి రాష్ట్రంలోకి రానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో వడగాల్పులు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

Telangana : తెలంగాణ ప్రజలకు చల్లని కబురు

Telangana Rains

Telangana Rain Alert : మాడు పగిలే ఎండల వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి వడగండ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వచ్చే నెలలో రెండు వారాల పాటు భానుడి భగభగలు తప్పవన్నారు. రాష్ట్రంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

జూన్ 3వ వారం నాటికి నైరుతి రుతుపవనాలు తీరం దాటి రాష్ట్రంలోకి రానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో వడగాల్పులు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

Also Read..Uppal Constituency: ఒకసారి గెలిచిన వారు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు.. బీఆర్‌ఎస్‌ లో రెండు వర్గాలు.. ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్

ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశముందన్నారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.