మొబైల్‌ ఫోన్‌ పోతే.. వెంటనే హాక్‌-ఐలో ఫిర్యాదు చేయండి

10TV Telugu News

if the mobile phone lost a complaint with Hawk-Eye : పోయిన మొబైల్‌ ఫోన్‌లను.. తిరిగి బాధితులకు అప్పగించడం కూడా చాలా ముఖ్యమని హైదరాబాద్‌ పోలీసులు భావిస్తున్నారు. అందుకే హాక్‌ ఐ లాస్ట్‌ మొబైల్‌ ఫోన్‌లో ఫిర్యాదు చేసిన వాటిని ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా గుర్తించి.. వాటిని రికవరీ చేస్తున్నారు. 35 ఫిర్యాదులకు సంబంధించి రికవరీ చేసిన మొబైల్‌ ఫోన్‌లను సీపీ అంజనీకుమార్‌ బాధితులకు అందించారు.

2015లో ప్రారంభమైన హాక్‌ ఐ యాప్‌ అప్లికేషన్‌ ద్వారా ఇప్పటి వరకు మొత్తం 500 మొబైల్‌ ఫోన్‌లను గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందించారు. మొబైల్‌ ఫోన్‌ పోతే వెంటనే హాక్‌-ఐలో ఫిర్యాదు చేయాలని సీపీ అంజనీకుమార్‌ సూచించారు.