JubileeHills Rape Case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక మలుపు.. మైనర్ నిందితులను మేజర్లుగా గుర్తింపు

ఇటీవల సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్లు అయిన ఐదుగురు నిందితుల్లో నలుగురిని మేజర్లుగా గుర్తిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

JubileeHills Rape Case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక మలుపు.. మైనర్ నిందితులను మేజర్లుగా గుర్తింపు

JubileeHills Rape Case: ఇటీవల సంచలనం సృష్టించిన హైదరాబాద్, జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదుగురు మైనర్ నిందితుల్లో నలుగురిని మేజర్లుగా గుర్తిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. జువైనల్ జస్టిస్ సెక్షన్ 15 ప్రకారం మైనర్లను, మేజర్లుగా గుర్తిస్తూ బోర్డు నిర్ణయించింది.

Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

నిబంధనల ప్రకారం సీసీఎల్ 5ను మాత్రం కోర్టు మేజర్‌గా గుర్తించలేదు. మైనర్ నిందితులను మేజర్లుగా గుర్తించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ సాగింది. విచారణ అనంతరం నలుగురిని మేజర్లుగా గుర్తించింది బోర్డు. నిందితులు మేజర్లు కావడంతో వీరికి మరింత కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా.. వారిలో ఐదుగురు మైనర్లుగా ఉన్నారు. తాజాగా వీరిలో నలుగురిని మేజర్లుగా గుర్తించారు.

Delhi Shocker: స్కూల్లో గొడవ.. పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్‌మేట్స్

గత మే 28న పదిహేడేళ్ల బాలికపై నిందితులు సామూహిక అత్యాచారం జరిగింది. ఒక వేడుకలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్, అమ్నేషియా పబ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లిన బాలికపై నిందితులు అత్యాచారం చేశారు. ఘటన జరిగిన తర్వాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, నిందితుల్ని అరెస్టు చేశారు.