ధరణి పోర్టల్ : అరగంటలోనే మ్యుటేషన్, ఎలా చేస్తారంటే

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 04:13 AM IST
ధరణి పోర్టల్ : అరగంటలోనే మ్యుటేషన్, ఎలా చేస్తారంటే

Dharani Portal: Mutation in half an hour : తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా సేవలు పొందుతున్నారు. వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కేవలం అరగంటలో పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. పోర్టల్ లోని రెడ్ కలర్ విండో ద్వారా..రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ కూడా వేగంగా పూర్తయ్యేలా రూపొందించిన సాఫ్ట్ వేర్ ఇందుకోసం ఉపయోగించనుంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 23 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లకుండానే..సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మ్యుటేషన్లు పూర్తి చేయనున్నారు. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం సులభతరమైన, సరళీకృత విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.




జరిగే విధానం : 

రెడ్ కలర్ క్లిక్ చేసిన తర్వాత..వచ్చే పేజీలో సిటిజన్ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
సిటిజన్ లాగిన్ పేజీలో మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. వచ్చే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.
అనంతరం డాక్యుమెంట్ నంబ్ క్రయ, విక్రయ దారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం నమోదు చేయాలి.
స్లాట్ బుక్ కాగానే..అమ్మకందారుడు లేదా..కొనుగోలు దారుడికి మొబైల్ నెంబర్ కు సమాచారం వస్తుంది.
ఆ సమాచారం ప్రకారం..అమ్మకం దారులు, కొనుగోలు దారులు, సాక్షులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.



స్లాట్ బుకింగ్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ దస్తావేజుకు సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తారు.
స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలను ఆన్ లైన్ లో ఈ చలాన్ ద్వారా చెల్లించాలి.
ఆ తర్వాత..సాక్షులు, క్రయ, విక్రయదారుల వివరాలు, బయోమెట్రిక్ ఆధారాలను డేటా ఎంట్రీ ఆపరేటర్ తీసుకుంటారు.
ఇది కాగానే..సబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు.
రిజిస్ట్రేషన్ డ్యాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్ లోడ్ చేస్తారు.



వెంటనే మ్యుటేషన్ సిగ్నేచర్ కోసం సబ్ రిజిస్ట్రార్ కు పంపిస్తారు. సంతకం చేయడంతో…సదరు భూమి లేదా ఆస్తి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.