Dating Apps : నూడ్ వీడియోతో బ్లాక్‌మెయిల్, రూ.70లక్షలు పొగొట్టుకున్న 60ఏళ్ల డాక్టర్

హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. దిమ్మతిరిగిపోయే చీటింగ్ బయటపడింది. డేటింగ్ యాప్‌లు ఎంత డేంజరస్ అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. డేటింగ్‌ యాప్‌ల వలలో చిక్కుకుని అమ్మాయిలతో చాటింగ్‌ కోసం 60ఏళ్ల డాక్టర్ ఏకంగా రూ.70లక్షల దాకా సమర్పించుకున్న ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

Dating Apps : నూడ్ వీడియోతో బ్లాక్‌మెయిల్, రూ.70లక్షలు పొగొట్టుకున్న 60ఏళ్ల డాక్టర్

Doctor Lost 70 Lakhs In Dating Apps

doctor lost 70 lakhs in dating apps: హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. దిమ్మతిరిగిపోయే చీటింగ్ బయటపడింది. డేటింగ్ యాప్‌లు ఎంత డేంజరస్ అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. డేటింగ్‌ యాప్‌ల వలలో చిక్కుకుని అమ్మాయిలతో చాటింగ్‌ కోసం 60ఏళ్ల డాక్టర్ ఏకంగా రూ.70లక్షల దాకా సమర్పించుకున్న ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

ఆయన పేరు రమేష్. డాక్టర్. వయసు 60ఏళ్లు. గుజరాత్ లో వైద్యం చేస్తుంటాడు. కాగా, ముషీరాబాద్‌లో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. నెలలో కొంతకాలం గుజరాత్‌లో, మిగతా రోజులు హైదరాబాద్‌లో ఉంటాడు. కాగా, ఈ వయసులోనూ అయ్యగారి కన్ను యువతులపై పడింది. వారితో చాటింగ్ చేయాలనే కోరిక కలిగింది. ఇంకేముంది డేటింగ్ యాప్ ల వైపు పరుగులు తీశాడు.

ఆరు నెలల క్రితం ఓ డేటింగ్‌ యాప్‌లో డాక్టర్ గారికి యువతి పరిచయం అయ్యింది. ఆ తర్వాత యువతితో కొంతకాలం వాట్సాప్‌లో చాటింగ్‌ చేశాడు. తర్వాత ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఓ రోజు ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నా అంటూ డాక్టర్ కి వల విసిరింది. అంతే, స్నేహం మరింత పెరిగింది. ఓ రోజు ఇద్దరూ కలిసి న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేసుకున్నారు. ఇక్కడే ఆ కిలేడీ అసలు కథ నడిపింది. ఈ బాగోతాన్ని ఆ మాయలేడీ రికార్డ్‌ చేసింది.

ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ చేసింతి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియోని సోషల్ మీడియాలో పెడతానని డాక్టర్ ని బెదిరించింది. అంతే డాక్టర్ కి దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. పరువు పోతుందని భయపడ్డాడో మరో కారణమో కానీ, ఆమెకు డబ్బివ్వడం స్టార్ట్ చేశాడు. 2020 నవంబర్ నెలలో పలు దఫాల్లో ఆమెకు రూ.39 లక్షల వరకు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ ఆ కిలేడీ బ్లాక్ మెయిల్ ఆపలేదు. ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంది. ఆమె వేధింపులతో విసిగిపోయిన డాక్టర్ చివరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఇంత జరిగినా డాక్టర్ గారికి ఇంకా బుద్ధి రాలేదు. తీరు మార్చుకోకుండా మళ్లీ డేటింగ్‌ యాప్‌ల్లో ఇతర అమ్మాయిలతో చాటింగ్‌ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల రోజుల్లో మరో రూ.30 లక్షలు ముట్టజెప్పాడని పోలీసులకు చెప్పి బోరుమన్నారు.

ఎందుకు అనవసరంగా డబ్బులు తగలబెడుతున్నారని ప్రశ్నిస్తే.. ‘నా డబ్బు నా ఇష్టం’.. ‘నాకు నచ్చినట్లు ఉంటా.. నచ్చినట్లు ఖర్చు చేస్తాను’ అంటూ ఎదురుదాడికి దిగుతున్నాడని భార్యాపిల్లలు పోలీసులు ముందు విలపించారు. ఇక లాభం లేదనుకున్న కుటుంబసభ్యులు, డాక్టర్ గారి బ్యాంక్‌ అకౌంట్ లను స్తంభింప చేయించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు ఆ డాక్టర్ బ్యాంక్ అకౌంట్ ను బ్లాక్ చేయించారు.

అయితే తన ఖాతాను తెరిపించాలంటూ ఆ డాక్టర్ పోలీసులను కోరుతున్నాడు. దీంతో పోలీసులు ఆ డాక్టర్ తో మాట్లాడారు. ‘ఇకపై గుర్తుతెలియని వారికి డబ్బులు బదిలీ చేయనని రాతపూర్వక హామీ ఇస్తేనే నీ బ్యాంక్ అకౌంట్ ను తెరిపిస్తాం’ అని అతడితో చెప్పారు. కాగా, ఇంత జరిగాక అతగాడి తీరు పోలీసులకు చిరాకు తెప్పిస్తోంది. నవంబర్ లో తాను పొగొట్టుకున్న రూ.39 లక్షలు తిరిగి తనకు దొరుకుతాయా.. నిందితులను పట్టుకున్నారా? అంటూ రోజూ సైబర్‌ పోలీసులను అడుగున్నాడట.