Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 32వేల 828కేసులు.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

మందు బాటిల్ దగ్గర మొదలుపెట్టి సినిమా హాల్లో, పోలీస్ సోషల్ మీడియా అకౌంట్లలో సైతం 'మద్యపానం తాగి వాహనం నడుపరాదు' అని చెప్పే మాటను పక్కకుపెట్టేస్తున్నారు. దేశంలో నమోదవుతున్న...

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 32వేల 828కేసులు.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

Drunk And Drive

Drunk and Drive: మందు బాటిల్ దగ్గర మొదలుపెట్టి సినిమా హాల్లో, పోలీస్ సోషల్ మీడియా అకౌంట్లలో సైతం ‘మద్యపానం తాగి వాహనం నడుపరాదు’ అని చెప్పే మాటను పక్కకుపెట్టేస్తున్నారు. దేశంలో నమోదవుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో తెలంగాణది మొదటి స్థానం.

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులతో పోలిస్తే హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇదే కారణంతో నమోదైన కేసులు 32వేల 828. సోమవారం ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో పెరుగుతున్న ప్రమాదాలు వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ పోలిస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుత ఏడాది 242 మంది ఇప్పటివరకూ మృతి చెందారట. సైబరాబాద్ పరిధిలో 232 మంది మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 1328 యాక్సిడెంట్ కు గురికాగా, అందులో 210మంది హైదరాబాద్ వాసులే.

……………………………… : చెడ్డీ‌గ్యాంగ్ వేటలో తాడేపల్లి పోలీసులు

తెలంగాణ వ్యాప్తంగా గతేడాది 343 మంది మృత్యువాతకు గురయ్యారు. 2020లో హైదరాబాద్ నగరంలో 189 మంది మృతి చెందగా.. ఇప్పటికే ప్రస్తుత ఏడాది 474కు చేరిపోయారు.

ఈ ప్రమాదాలన్నింటికీ ఓవర్ స్పీడే కారణమని చెబుతున్నారు. జరిగేవన్నీ వీఐపీ జోన్లే కావడం గమనార్హం. బడాబాబులుండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఓఆర్ఆర్ లపైనే జరుగుతున్నాయి.

తాగిన వ్యక్తులు డ్రైవర్ లేకుండా పబ్బు నుంచి వెళ్లొద్దంటూ పోలీస్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇకపై తాగి వెహికల్ నడిపి ప్రమాదానికి గురైతే పబ్‌లదే బాధ్యత అని గతంలోనూ చెప్పింది. ఈ తరహాలోనే 12 పబ్ ల పైన కేసులు నమోదయ్యాయి.

…………………………… : ఈ వారం థియేటర్ / ఓటిటిలో వచ్చే సినిమాలు