Borabanda లో భూ ప్రకంపనలు

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 05:57 AM IST
Borabanda లో భూ ప్రకంపనలు

Borabanda : జూబ్లీహిల్స్ పరిసర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు (Earthquake) చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 2020, అక్టోబర్ 02వ తేదీ శుక్రవారం రాత్రి 8.15 నుంచి 9.00 గంటల మధ్య పలుమార్లు భూమి కంపించింది. స్థానికంగా ఉన్న ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు.



ఏమైందోనని కంగారు పడ్డారు. దాదాపు 12 సార్లు భూమి కంపించిందని అంటున్నారు. జూబ్లీహిల్స్, రహమత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, అల్లాపూర్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు చెబుతున్నారు. బస్తీలు, కాలనీల్లోని జనాలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి 9 గంటల వరకు ఇళ్లలోపలికి వెళ్లలేదు.



రోడ్లపైనే ఉండిపోయారు. 9 గంటల అనంతరం భూ ప్రకంపనలు ఆగిపోవడంతో జనం ఇళ్లలోకి వెళ్లారు. అయితే..బోరబండలో రాత్రి 11.25 గంటలకు మరోసారి పెద్ద శబ్ధంతో భూమి కంపించిందని తెలుస్తోంది. భూకంపమా లేక భారీ శబ్దాలా అనేది తెలియాల్సి ఉంది.



2017లోనూ ఇదే తరహాలో భారీ శబ్దాలు వచ్చినట్లు బోరబండ వాసులు వెల్లడిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.