No mask Fine : తెలంగాణలో మాస్క్ లేకుంటే జైలుకే..

తెలంగాణలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క‌ఠిన చ‌ర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకపోతే కనీసం వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు.

No mask Fine : తెలంగాణలో మాస్క్ లేకుంటే జైలుకే..

Kcr Mask

Rs 1,000 Fine for no mask : తెలంగాణలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క‌ఠిన చ‌ర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకపోతే కనీసం వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు.. పరిస్థితులను బట్టి జరిమానా పెంచడంతో పాటు.. రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది.

మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే వారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనరేట్లకు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రజల్లో మార్పు కనిపించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు..

ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ముఖానికి మాస్క్‌ ధరించకుండా రోడ్లపై, వాహనాల్లో తిరిగే వారిని ఫోటోలు తీసి జరిమానా విధించనున్నారు… ఇందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట క‌నిపిస్తే వారికి భారీ జ‌రిమానా విధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నడుం బిగించారు.

ఇకపై మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు మాస్క్‌ లేకుండా వెళ్తున్నవారి ఫోటోలు తీసి వాహనం నంబరు ఆధారంగా ఇంటికి ఈ-చలానాలను పంపనున్నారు. ఇప్పటికే మాస్కులు లేకుండా వాహనాల్లో వెళ్తున్న వారిపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు 15 వేల కేసులు నమోదు చేశారు. కాగా మాస్కులు లేకుండా ఉన్న వారిని గుర్తించడంలో ట్రాఫిక్‌ పోలీసులతోపాటు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రధానపాత్ర పోషించనున్నాయి.