ఆంధ్రప్రదేశ్‌తో పాటు 13 రాష్ట్రాలకు రూ.6.2కోట్లు విడుదల చేసిన కేంద్రం

  • Published By: Subhan ,Published On : May 12, 2020 / 10:51 AM IST
ఆంధ్రప్రదేశ్‌తో పాటు 13 రాష్ట్రాలకు రూ.6.2కోట్లు విడుదల చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం 14 రాష్ట్రాలకు రూ.6వేల 195.08కోట్లను విడుదల చేసింది. సెకండ్ ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా కింద సోమవారం దీనికి అనుమతులిచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో ఇది అదనపు బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ స్టేట్ మెంట్ రూపంలో పేర్కొంది. 

15వ ఫైనాన్స్ కమిషన్ ఈ గ్రాంట్ ను రికమెంట్ చేసింది. తొలి ఇన్‌స్టాల్మెంట్ ను మార్చి 14నే ఇష్యూ చేసింది కేంద్రం. సోమవారం దీనికి అడ్వాన్స్ గా రూ.వెయ్యి 276కోట్లు కేరళకు, హిమాచల్ ప్రదేశ్ కు రూ.952కోట్లు, పంజాబ్ కు రూ.638కోట్లు, అస్సాంకు రూ.631కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.491కోట్లు, ఉత్తరాఖాండ్ కు రూ.423కోట్లు, పశ్చిమబెంగాల్ కు రూ.417కోట్లు విడుదల చేసింది. 

కరోనావైరస్ కంటైన్మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ గ్రాంట్ ఉపయోగపడుతుంది. క్వారంటైన్ సదుపాయాలు, శాంపుల్ కలెక్షన్, స్క్రీనింగ్, టెస్టింగ్ లేబొరేటరీల అదనపు సెట్టింగుల కోసం ఇవి ఉపయోగపడతాయి. 

పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్, హెల్త్ కేర్, మునిసిపల్, పోలీస్, ఫైర్ అధికారులకు, థర్మల్ స్కానర్ల కొనుగోలుకు, వెంటిలేటర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనడానికి, ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు సమకూర్చడానికి ఇవి ఉపయోగపడతాయి. 

Read More:

Aarogya Setu యాప్‌లో మీ డేటా పదిలమేనా.. !

మీ ట్రైన్ టిక్కెట్టుకు డబ్బులు సోనియమ్మ ఇచ్చారు