ToLet Board GHMC Fine : టులెట్ బోర్డు పెడితే ఫైన్.. జీహెచ్ఎంసీ క్లారిటీ

హైదరాబాద్ లో టులెట్ బోర్డులు పెడితే జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారనే వార్తలు జనంలో గందరగోళానికి దారి తీశాయి. జీహెచ్ఎంసీ తీరుతో భవనాల, ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నార

ToLet Board GHMC Fine : టులెట్ బోర్డు పెడితే ఫైన్.. జీహెచ్ఎంసీ క్లారిటీ

Tolet Board Ghmc Fine

ToLet Board GHMC Fine : హైదరాబాద్ లో టులెట్ బోర్డులు పెడితే జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారనే వార్తలు జనంలో గందరగోళానికి దారి తీశాయి. జీహెచ్ఎంసీ తీరుతో భవనాల, ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. టులెట్ బోర్డు పెట్టడం కూడా నేరమా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లలోని గదులను, దుకాణాలను అద్దెకు ఇవ్వడానికి తమ ఇంటి గోడపై టులెట్‌ బోర్డును పెట్టడం సర్వసాధారణం. అయితే, ఇలా టులెట్ బోర్డు పెట్టినందుకు నగరంలో పలువురు వ్యక్తులకు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించడం చర్చకు దారితీసింది. ఇదెక్కడి రూల్ అని జనాలు గగ్గోలు పెడుతున్నారు. సొంతింటికి టులెట్ బోర్డు పెట్టినా ఫైన్ విధిస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. దీనిపై వారు క్లారిటీ ఇచ్చారు.

అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, వాల్ రైటింగ్ లకు మాత్రమే జరిమానా విధిస్తాం. సొంతింటికి టులెట్ బోర్డు పెట్టినా ఫైన్ అనేది వాస్తవం కాదు. వ్యక్తిగతంగా తమ తమ ఇళ్ల దగ్గర ఏర్పాటు చేసుకునే టులెట్ బోర్డులపై ఎలాంటి జరిమానాలూ ఉండవు. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే అన్ని రకాల పోస్టర్లకే ఫైన్లు విధిస్తాం. పబ్లిక్ ప్రదేశాల్లో టులెట్, కోచింగ్, రియల్ ఎస్టేట్, పాన్ కార్డు చేస్తాం అని పోస్టర్లు పెడితే మాత్రం ఊరుకోం. జరిమానా విధిస్తాం అని అధికారులు హెచ్చరించారు.

కాగా, ఈవీడీఎం కింద సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల బహిరంగ ప్రదేశాల్లోని అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, వాల్ రైటింగ్ తదితరాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. జరిమానా విధించారు.

సొంతింటికి టులెట్ బోర్డు పెట్టినా.. జరిమానా అంటూ వస్తున్న వార్తలను జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ ఖండించారు. వ్యక్తిగతంగా ఇళ్ల దగ్గరున్న టులెట్ బోర్డులపై జరిమానా విధిస్తే.. తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి పోస్టర్లను అంటించరాదని తేల్చి చెప్పారు.

ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం టు లెట్ బోర్డులు పెట్టే వారిపై కొరడా ఝళిపిస్తామని ఇటీవల హెచ్చరించిన జీహెచ్ఎంసీ బుధవారం కార్యరంగంలోకి దిగింది. మూసాపేట డివిజన్ పరిధిలో ఓ దుకాణ యజమానికి రూ. 2 వేల జరిమానా విధించింది. మోతీనగర్ పరిధిలోని పాండురంగ నగర్ చౌరస్తాలో స్థానిక వ్యాపారి ఎరమల్ల లాలయ్యగౌడ్ దుకాణం కోసం ఓ గదిని అద్దెకు ఇచ్చేందుకు ‘టు లెట్’ బోర్డు తగిలించారు. దీన్ని నేరంగా పరిగణించిన జీహెచ్ఎంసీ ఈడీ, డీఎం డైరెక్టర్ రూ.2వేల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా ఈ-చలానా ద్వారా చెల్లించాలని నోటీసుల్లో తెలిపారు. కాగా, టు లెట్ బోర్డులపైనా జరిమానా విధించనున్నట్టు జీహెచ్ఎంసీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా టులెట్ బోర్డులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవంది.