Ponguleti Srinivasa Reddy: పార్టీ ఏదైనా సరే.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతాం

జెండా ఏదైనా.. పార్టీ ఏదైనా సరే.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. త్వరలో‌నే ఏ పార్టీ అనేది నిర్ణయం ప్రకటిస్తానని, మీ అందరి కోరిక మేరకు నిర్ణయం ఉంటుందని అభిమానులకు పొంగులేటి చెప్పారు.

Ponguleti Srinivasa Reddy: పార్టీ ఏదైనా సరే.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతాం

Ponguleti Srinivsa Reddy

Ponguleti Srinivasa Reddy: సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ కనీసం వంద రూపాయలు కూడా హుండీలో వేయలేదని, ఇలాంటి కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తాడట.. మనం నమ్మాలా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో పొంగులేటి తన వర్గీయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. భద్రాచలం రాములవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాటతప్పారని అన్నారు. రాముడిపైనే జోకులు వేశారు, అవహేళన చేశారు. హామీలు అమలు చేయలేదు. రాములవారి వాగ్దానంకూడా తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ponguleti Srinivasa Reddy: ఖమ్మంలో తారస్థాయికి పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్.. ఎమ్మెల్యే సండ్రపై పొంగులేటి అనుచరుల విమర్శలు

సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో ఒకేఒక్కసారి తలంబ్రాలు తీసుకొని వచ్చారని, అది సీఎం కేసీఆర్‌కు రాముడు మీద గౌరవం అని అన్నారు. పోడు భూముల్లో గిరిజనులు, గిరిజ నేతరులకు ఒక్క ఎకరంకు పట్టా ఇచ్చారా అని పొంగులేటి ప్రశ్నించారు. ముచ్చటగా మూడోసారి సీట్లో కూర్చోవాలని తాపత్రయంతో గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు, గిరిజనులతో చెలగాటం అడుతున్నారంటూ పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికలొస్తే డబుల్ బెడ్ రూం ఇళ్ళు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. సొంత స్థలం ఉంటే ఇళ్ళు ఇస్తామని చెప్పారు, ఎన్నికలొస్తే అవి గుర్తుకొస్తాయా అని సీఎంని ప్రశ్నించారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారని, టిఎస్పిఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చి మీలోని కొంత మంది స్వార్ధం వల్ల పరీక్షలు అన్ని రద్దు చేశారని పొంగులేటి విమర్శించారు. విద్యార్థులకు అన్యాయం జరిగినా టిఎస్పీఎస్సీ కమిటీ సభ్యులను ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రశ్నించారు.

Ponguleti Srinivasa Reddy: శీనన్న ఒక్కడు కాదు.. బెదిరిస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం

మీ పార్టీ మంత్రుల పీఏలపై, కొందరు అధికారులపై ఆరోపణలు వచ్చాయని, వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదుని పొంగులేటి ప్రశ్నించారు. టిఎస్పిఎస్సీ పరీక్షలు రాసిన ప్రతిఒక్క విద్యార్థికి ప్రభుత్వం లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాక, సిట్ తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని, సిట్టింగ్ జడ్జి‌తో విచారణ చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఏఒక్క ప్రాజెక్టు వచ్చిన.. నిధులు వచ్చి కల్వకుంట్ల కుటుంబంకు చేరుతున్నాయంటూ పొంగులేటి ఆరోపించారు. పార్టీ ఏదైనా సరే.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామని అన్నారు. త్వరలో‌నే ఏ పార్టీఅనేది నిర్ణయం ప్రకటిస్తానని, మీ అందరి కోరిక మేరకు నిర్ణయం ఉంటుందని అభిమానులకు పొంగులేటి చెప్పారు.