Mallu Bhatti Vikramarka : రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుంటున్న కేసీఆర్ ఫ్యామిలీ.. వ్యవసాయానికి సాయమే లేదు : మల్లు భట్టి విక్రమార్క

రైతుబంధు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాకాలను అన్ని బంద్ చేశారని పేర్కొన్నారుు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ధనిక రాష్ట్రంలో 9 ఏళ్లవుతున్న కొలువులు రాలేదన్నారు.

Mallu Bhatti Vikramarka : రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుంటున్న కేసీఆర్ ఫ్యామిలీ.. వ్యవసాయానికి సాయమే లేదు : మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లిలో మల్లు భట్టి విక్రమార్క 18వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసమే తాను పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసమో.. ఎన్నికల కోసమో… చేస్తున్న యాత్ర కాదన్నారు. తెలంగాణ లక్ష్యాలు నెరవేరనందున ప్రజలు పడుతున్న బాధలను ఈ ప్రభుత్వానికి చెప్పడానికే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపదను నలుగురు ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పరిపాలనలో వ్యవసాయానికి సాయమే లేదని ఎద్దేవా చేశారు. రైతుబంధు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాకాలను అన్ని బంద్ చేశారని పేర్కొన్నారుు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ధనిక రాష్ట్రంలో 9 ఏళ్లవుతున్న కొలువులు రాలేదన్నారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని చెప్పారు. పావలా వడ్డీలు రాలేదని, రుణమాఫీ పూర్తి కాలేదని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని, దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదని విమర్శించారు. రూ.18 లక్షల కోట్ల సంపద, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన రూ.5 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

Mallu Bhatti Vikramarka : ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ ఏర్పడలేదు – మల్లు భట్టి విక్రమార్క

చెన్నూరు నియోజకవర్గంలోని దాంపూర్ నుంచి బూరుగుపల్లి వరకు తాను నడిచి వచ్చిన రోడ్లు కంకర తేలి గతుకులమయంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డుకు నిధులు మంజూరైనప్పటికీ తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. భీమారం ప్రాంతానికి గొల్లవాగు నుంచి 9500 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్మాణం చేస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం కాలువలను మెయింటనెన్స్ చేయలేని దుస్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుతో చెన్నూరులో సస్యశ్యామలం చేసేందుకు పనులు ప్రారంభించారని వెల్లడించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్ధాంతరంగా పనులను నిలిపివేసి ప్రాజెక్టు రీ డిజైన్ చేయడం వల్ల చెన్నూరుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని వాపోయారు. చెన్నూరుకు సాగునీరు అందకపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమే కారణమని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లవుతున్న చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తికాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,05 లక్షల ఉద్యోగుల నుంచి 42 వేలకు కుదించారని పేర్కొన్నారు. 60 వేల మంది స్థానికుల ఉద్యోగులను రోడ్డుపాలు చేసిందన్నారు.

Mallu Bhatti Vikramarka : ఈ 9ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబం మాత్రమే లాభపడింది-భట్టి విక్రమార్క

సింగరేణి క్వార్టర్స్ రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు సృష్టించడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు. చెన్నూరు నుంచి వందల లారీల ఇసుకను తరలిస్తున్నది ప్రభుత్వ పెద్దలు కాదా? అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా నడుపుతున్నదే ప్రభుత్వంలో ఉన్న పెద్ద తలకాయలని పేర్కొన్నారు. తెలంగాణ వనరులను కొంతమంది మాత్రమే దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల చెన్నూరు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు వరదలతో మునిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

విద్యార్థి నాయకుడిగా చెప్పుకునే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న విషయం తెలియదా అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేక, లేక ఒక నోటిఫికేషన్ వేసి ప్రశ్నపత్రం లీకేజీ చేసి నిరుద్యోగుల లక్ష్యాలను అంధకారం చేసిందన్నారు.  బాల్క సుమన్ నిజమైన విద్యార్థి నాయకుడైతే ప్రశ్న పత్రం లీకేజీపై బయటకు వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. విద్యార్థుల పోరాటానికి బాల్క సుమన్ అండగా ఉండాలన్నారు.

Telangana Congress: రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలి: భట్టి విక్రమార్క

పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం వచ్చినప్పుడల్లా కేసీఆర్ కొత్త పథకాలు తీసుకొస్తారని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికల ముందు ఇస్తామన్న నిరుద్యోగ భృతి నాలుగు సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులందరికీ నిరుద్యోగ భృతిని లెక్క కట్టి వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఖాళీలన్నిటిని భర్తీ చేస్తామని పేర్కొన్నారు.