Gandhi Jayanti 2022: అప్పుడు నన్ను కూడా అవహేళన చేశారు: సీఎం కేసీఆర్

తెలంగాణ పోరాటం చేసినప్పుడు తనను కూడా అవహేళన చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. అయినప్పటికీ మహాత్మా గాంధీని స్మరించుకుని ముందుకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఆవరణలో 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా కేసీఆర్ ఇవాళ ఆవిష్కరించి మాట్లాడారు. ఆనాడు యావత్తూ భారతాన్ని నడిపించిన సేనాని మహాత్మా గాంధీ అని చెప్పారు. ప్రపంచ నేతలకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు.

Gandhi Jayanti 2022: అప్పుడు నన్ను కూడా అవహేళన చేశారు: సీఎం కేసీఆర్

Gandhi Jayanti 2022: తెలంగాణ పోరాటం చేసినప్పుడు తనను కూడా అవహేళన చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. అయినప్పటికీ మహాత్మా గాంధీని స్మరించుకుని ముందుకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఆవరణలో 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా కేసీఆర్ ఇవాళ ఆవిష్కరించి మాట్లాడారు. ఆనాడు యావత్తూ భారతాన్ని నడిపించిన సేనాని మహాత్మా గాంధీ అని చెప్పారు. ప్రపంచ నేతలకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు.

గాంధీ పుట్టి ఉండకపోతే తాను అమెరికా అధ్యక్షుడిని కాలేకపోయేవాడినని ఒబామా అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనం అందరం చేసుకున్న పుణ్యమని అన్నారు. అహింస, శాంతి, ధర్మం, సేవా సిద్ధాంతాలు విశ్వజనీనమని చెప్పారు. సమస్యలకు యుద్ధాలు పరిష్కారం కాదని చెప్పిన మహానీయుడు గాంధీ అని అన్నారు.

గాంధీ ఆసుపత్రి వద్ద మహాత్ముడి విగ్రహ ఏర్పాటుతో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చిరస్థాయి కీర్తి దక్కుతుందని చెప్పారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి సేవలు ప్రశంసనీయమని అన్నారు. కరోనా వేళ గాంధీ వైద్యులు, సిబ్బంది ధైర్యంగా పనిచేశారని తెలిపారు. గాంధీ స్ఫూర్తితో ఎంతో మంది ప్రాణాలు కాపాడారని అన్నారు. మంచి జరిగితే తప్పకుండా ప్రశంసలు వస్తాయని అన్నారు.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 3,375 కరోనా కేసులు నమోదు