TRS: అభివృద్ధిపై ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధం: హరీష్ రావు

కేంద్రంలో ఉన్న 15 లక్షలకుపైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలి. దేశంలోని సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు.

TRS: అభివృద్ధిపై ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధం: హరీష్ రావు

Harish Rao

TRS: ప్రతిపక్షాలకు విమర్శించడానికి విషయం లేక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని, అవసరమైతే అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో సోమవారం హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘‘తెలంగాణలో లక్షా యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం.అన్ని ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారానే ఎంపిక జరుగుతుంది. పారదర్శకత కోసం ఇంటర్వ్యూలు రద్దు చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన.

TRS MLC Kavitha : విమర్శల్ని మహిళా జర్నలిస్టులు ధైర్యంగా ఎదుర్కోవాలి: ఎమ్మెల్సీ కవిత

దేశంలోనే మొదటిసారి ఐదువేల గ్రూప్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది. స్థానికతకు పెద్ద పీట వేస్తూ 60 శాతం ఉద్యోగాలు ప్రాంతీయత ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది. జీఓ 317 ద్వారా జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ వీలవుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ఈ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల నిరుద్యోగం మరింత పెరుగుతుంది. కేంద్రంలో ఉన్న 15 లక్షలకుపైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలి. దేశంలోని సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు. కేంద్రంలోని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా కేసీఆర్‌ను తిట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుంది.

congress: ఓడిపోయే పార్టీతో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుంది: మహేష్ గౌడ్

సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలి. ప్రతిపక్షాలు విచక్షణ లేకుండా విమర్శలు చేస్తున్నాయి. చేతనైతే ప్రతిపక్షాలు అభివృద్ధిపై చర్చకు రావాలి’’ అని హరీష్ వ్యాఖ్యానించారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీలో మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా 20 లక్షల పుస్తకాల్ని ఆన్‌లైన్‌లో చదువుకునే వీలుందన్నారు. సిద్ధిపేట జిల్లాలో మెడికల్ కాలేజీ, ఐటీ కాలేజీలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై దృష్టి పెట్టామని చెప్పారు.