మున్సిపల్ ఫలితాలు : బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు నిరూపించారు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. కారు స్పీడ్ కి అడ్డు లేదు. 120 మున్సిపాలిటీలకు

మున్సిపల్ ఫలితాలు : బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు నిరూపించారు

Ktr Kavitha Harish Rao

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. కారు స్పీడ్ కి అడ్డు లేదు. 120 మున్సిపాలిటీలకు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. కారు స్పీడ్ కి అడ్డు లేదు. 120 మున్సిపాలిటీలకు గాను 100కు పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 9 కార్పొరేషన్లకు గాను ఏడింటిలో టీఆర్ఎస్ హవా కనిపించింది. మున్సిపల్ ఫలితాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం నింపాయి. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఫలితాలపై నేతలు స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాదే అని చెప్పడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని మంత్రి హరీష్ రావు అన్నారు.

ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పడానికి ఈ ఫలితాలే రుజువు అన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, అందుకే పుర పోరులో టీఆర్ఎస్ కి పట్టం కట్టారని హరీష్ రావు చెప్పారు. ప్రత్యర్థులు అందుకోలేని విజయాన్ని టీఆర్ఎస్ సాధించిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం కోసం శ్రమించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు హరీష్ రావు అభినందనలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అపూర్వ విజయం దక్కిందని కవిత ట్వీట్ చేశారు. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.

సంక్షేమ పథకాలతోనే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. పురపోరులో ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షాల కంటే మా రెబల్ అభ్యర్థులే ఎక్కువ గెలిచారని ఆయన చెప్పారు. ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు.