Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లపై వర్షపు నీరు, లోతట్టు ప్రాంతాలు జలమయం

ముఖ్యంగా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అధికంగా వర్షపాతం నమోదు అయింది. దాంతో పాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉండే అంబర్ పేట్ లో వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. 

Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లపై వర్షపు నీరు, లోతట్టు ప్రాంతాలు జలమయం

Rain

Heavy Rain In Hyderabad : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం నుంచి హైదరాబాద్ లో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో భాగ్యనగరం తడిసిముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. దీంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

అర్ధరాత్రి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అమీర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, సైదాబాద్, మాదన్నపేట, బహదూర్ పురా, చంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, శాలిబండతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Andhra Pradesh : ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం.. కడప జిల్లాలో గాలి బీభత్సానికి ఒకరు దుర్మరణం

ముఖ్యంగా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అధికంగా వర్షపాతం నమోదు అయింది. దాంతో పాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉండే అంబర్ పేట్ లో వర్షం కురిసింది. నగరంలో ఉరుములు మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది.

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 4 నుంచి 5 సెంటి మీటర్ల వరకు వర్షపాతం నమోదు కాగా, అంబర్ పేటలో 4 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. శేరిలింగంపల్లి, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలిలో 4 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టింది.