Heavy Rains In Telugu States : రెయిన్ అలర్ట్.. రానున్న 3 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Heavy Rains In Telugu States : రెయిన్ అలర్ట్.. రానున్న 3 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Heavy Rains In Telugu States : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ చెప్పారు.

సోమవారం హైద‌రాబాద్ న‌గ‌రంలో వాన దంచికొట్టింది. భారీ వ‌ర్షానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. వాన కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. శేరిలింగంప‌ల్లి, షేక్‌పేట్, ఆసిఫ్‌న‌గ‌ర్ ఏరియాల్లో అత్య‌ధికంగా 4.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. చార్మినార్, ఖైర‌తాబాద్‌లో 4 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిశీలిస్తే.. నిజామాబాద్‌లోని డిచ్‌ప‌ల్లిలో అత్య‌ధికంగా 27 మి.మీ., సిరికొండ‌లో 26.8 మి.మీ., బోధ‌న్‌లో 25.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయని.. దాని ప్రభావంతో వానలు పడతాయని వివరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. వర్షాల సమయంలో పిడుగులు పడే చాన్స్ ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంది. కరెంట్ పోల్స్ కు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పింది.

ఇక మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ న‌గ‌రంలో వాన దంచికొట్టిన సంగ‌తి తెలిసిందే. తెల్ల‌వారుజామున 5 గంట‌లకు కురిసిన భారీ వ‌ర్షానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. శేరిలింగంప‌ల్లి, షేక్‌పేట్, ఆసిఫ్‌న‌గ‌ర్ ఏరియాల్లో అత్య‌ధికంగా 4.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. చార్మినార్, ఖైర‌తాబాద్‌లో 4 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిశీలిస్తే.. నిజామాబాద్‌లోని డిచ్‌ప‌ల్లిలో అత్య‌ధికంగా 27 మి.మీ., సిరికొండ‌లో 26.8 మి.మీ., బోధ‌న్‌లో 25.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.