All Religion Crematorium : సర్వ మత శ్మశాన వాటిక.. ఒకే చోట హిందూ, ముస్లిం, క్రైస్తవుల దహన సంస్కారాలు

హైదరాబాద్ లో సర్వ మత శ్మశాన వాటికలు నిర్మించారు. ఎల్ బీ నగర్ లో శ్మశాన వాటికలు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలిచాయి. ఫతుల్లాగూడలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల శ్మశాన వాటికలు ఒకే చోట ఉన్నాయి.

All Religion Crematorium : సర్వ మత శ్మశాన వాటిక.. ఒకే చోట హిందూ, ముస్లిం, క్రైస్తవుల దహన సంస్కారాలు

cremation grounds

All Religion Crematorium : సాధారణంగా వివిధ మతాలకు చెందిన శ్మశాన వాటికలు వేర్వేరు చోట ఉంటాయి. గ్రామాల్లో కులాల వారిగా వేర్వేరు చోట దహన సంస్కారాలు చేస్తుంటారు. అయితే హైదరాబాద్ లో సర్వ మత శ్మశాన వాటికలు నిర్మించారు. ఎల్ బీ నగర్ లో శ్మశాన వాటికలు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలిచాయి. ఫతుల్లాగూడలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల శ్మశాన వాటికలు ఒకే చోట ఉన్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ కారణాలతో రోజుకు 2వేల 500 మందికిపైగా మరణిస్తుండగా దహన సంస్కారాలకు సరైన వసతులు లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫతుల్లాగూడలో ఒకే చోట హిందూ, ముస్లిం, క్రైస్తవులకు శ్మశాన వాటికలు నిర్మించారు.

Muslim Donate Land For Hindu Temple : వెల్లివిరిసిన మత సామరస్యం.. ఆలయ నిర్మాణానికి భూమిచ్చిన ముస్లిం

పర్యవరాణానికి ముప్పు కలగకుండా పూర్తిగా సోలార్ విద్యుత్ తోనే దహన సంస్కారాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నారు. కడసారి చూపుకు నోచుకోలేని వారి కోసం సెల్ ఫోన్ లో అంతిమ సంస్కారాన్ని వీక్షించేలా వసతులు కల్పించడం శోచనీయం.