Hyderabad : యువతి చెయ్యి పట్టుకున్న క్యాబ్ డ్రైవర్.. చితకబాదిన స్థానికులు

క్యాబ్ లో ఎక్కిన ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ కి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు.. నార్సింగి పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad : యువతి చెయ్యి పట్టుకున్న క్యాబ్ డ్రైవర్.. చితకబాదిన స్థానికులు

Hyderabad

Hyderabad : క్యాబ్ లో ఎక్కిన ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ కి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు.. నార్సింగి పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సన్‌సిటీలో నివసిస్తున్న ఓ యువతి మంగళవారం రాత్రి సమయంలో హైదరాబాద్‌ నుంచి క్యాబ్‌లో హైదర్‌షాకోట్‌కు వచ్చింది.

Read More : Peddapalli : లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి

ఈ తరుణంతో డ్రైవర్‌ ఆ యువతితో అసభ్యంగా మాట్లాడటం, చెయ్యిపట్టుకుని లాగటంతో ఆమె క్యాబ్‌ దిగగానే స్థానికులకు ఆ విషయం తెలిపింది. దీంతో అక్కడున్న వారు అతనికి దేహశుద్ధి చేసి నార్సింగి పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేశామని సెక్టార్‌ ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు. కాగా ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.

Read More : Lakhimpur Kheri : సొంత కాన్వాయ్ లోనే లఖిమ్‌పూర్‌ కి బయల్దేరిన రాహుల్ గాంధీ