CV Anand On Punishment : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులకు ఉరిశిక్ష..?

అప్పటికప్పుడు వేసుకున్న ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని, అందులో ఐగుదురు మైనర్లు ఉన్నారని తెలిపారు.

CV Anand On Punishment : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులకు ఉరిశిక్ష..?

Cv Anand (1)

CV Anand On Punishment : అప్పటికప్పుడు వేసుకున్న ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు పోలీసులు. అసలు ఈ కేసులో ఏం జరిగింది అన్న దగ్గరి నుంచి అన్ని వివరాలు వెల్లడించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. మంగళవారం రాత్రి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసులో లోతుగా దర్యాఫ్తు చేశామని, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని, అందులో ఐగుదురు మైనర్లు ఉన్నారని తెలిపారు సీవీ ఆనంద్.

పార్టీ నిర్వహించాలన్న ఆలోచన మార్చిలోనే బెంగళూరుకి చెందిన ఓ యువకుడికి వచ్చిందని, అక్కడి నుంచి ఈ వ్యవహారం ఈ మొదలైందన్నారు సీవీ ఆనంద్. సీవీ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం పబ్ లో నాన్ ఆల్కహాలిక్ పార్టీ జరిగింది. అదే సమయంలో ఇద్దరు నిందితులు ఇద్దరు అమ్మాయిలను వేధించారు. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చారు. అప్పటికే మరికొందరు నిందితులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక అమ్మాయి వారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయింది.(CV Anand On Punishment)

CV Anand : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. పక్కా ప్లాన్ ప్రకారమే అత్యాచారం, అసలేం జరిగిందంటే..

బాధితురాలు మాత్రం వారి ట్రాప్ లో పడింది. ఆరుగురు నిందితులు రెండు వాహనాల్లో అమ్మాయిని తీసుకుని బేకరీ వరకు వెళ్లారు. ఆ సమయంలోనే బాలికను వేధించారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకడు అక్కడే ఆగిపోయాడు. మిగిలిన వారు ఇన్నోవాలో అమ్మాయిని తీసుకుని పెద్దమ్మ గుడి వెనుకున్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అమ్మాయిపై ఐదుగురు అత్యాచారం చేశారని పోలీసులు తేల్చారు.

ఈ కేసులో నేర నిరూపణ అయితే నిందితులకు 20ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడుతుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అంతటి కఠినమైన సెక్షన్లు నమోదు చేశామన్నారు. కొన్ని సీరియస్ కేసుల్లో ఈ సెక్షన్లకు జీవిత ఖైదుతో పాటు ఉరిశిక్ష కూడా పడొచ్చని అన్నారు.

”ఈ కేసులో గ్యాంగ్ రేప్ సెక్ష‌న్లు (376డీ గ్యాంగ్ రేప్, 323 కాజింగ్ హర్ట్, పోక్సో చట్టం.. 366ఏ కిడ్నాపింగ్) న‌మోదు చేసిన నేప‌థ్యంలో నిందితుల‌కు మూడు ర‌కాల శిక్ష‌లు ప‌డే అవ‌కాశ‌ముంది. నేరం నిరూపణ అయితే 20 ఏళ్ల జైలు శిక్ష‌, లేదంటే జీవించి ఉన్నంత కాలం పాటు జైలు శిక్ష‌, లేదంటే ఉరి శిక్ష‌ ప‌డే అవ‌కాశం ఉంది. అత్యాచారానికి పాల్ప‌డ‌ని నిందితుడికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉందని” సీపీ చెప్పారు.

Girl Rape : సికింద్రాబాద్ లో బాలికపై గ్యాంగ్ రేప్..ఐదుగురు నిందితులకు రిమాండ్

అత్యాచారం కేసులో వీడియోలు బయటకు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై సీవీ ఆనంద్ స్పందించారు. నిందితుల మధ్య ఆధిపత్యపు పోరు కారణంగానే వీడియోలు బయటకు వచ్చాయని సీపీ తెలిపారు. వీడియోలు వాళ్లే తీసి వాళ్లే స్ప్రెడ్ చేశారని సీపీ వెల్లడించారు.

ఇక ఈ కేసులో ఐదుగురు నిందితులు మైన‌ర్లే కావ‌డంతో వారు ఎవ‌ర‌న్న విషయాన్ని చెప్ప‌డం కుద‌ర‌ద‌ని కూడా సీపీ చెప్పారు. వెర‌సి నిందితుల్లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడా? లేదా? అన్న‌ది తాము చెప్ప‌లేమ‌ని తెలిపారు. ఈ కేసులో హోంమంత్రి మ‌న‌వ‌డు ఉన్నాడ‌ని చాలా మంది ఆరోపించారని, అయితే ఆ దిశ‌గా ఆధారాలు దొర‌కలేద‌ని ఆయ‌న తెలిపారు. స‌ద‌రు ఆధారాలు ఏవైనా ఉంటే త‌మ‌కివ్వాల‌ని, ఆ ఆధారాలు నిజ‌మ‌ని తేలితే త‌ప్ప‌నిస‌రిగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా క‌మిష‌న‌ర్ చెప్పారు.