Hussain Sagar : డేంజర్ బెల్స్.. నిండుకుండలా హుస్సేన్ సాగర్.. ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటిమట్టం 514.75 ఏడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.41 అడుగులుగా ఉంది.

Hussain Sagar : డేంజర్ బెల్స్.. నిండుకుండలా హుస్సేన్ సాగర్.. ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు

Hussain Sagar

Hussain Sagar : భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటిమట్టం 514.75 ఏడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.41 అడుగులుగా ఉంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఐదారు రోజుల నుంచి హైద‌రాబాద్ వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయి. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా హుస్సేన్ సాగ‌ర్‌కు అధికంగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఎగువ నుంచి వ‌ర‌ద పోటెత్త‌డంతో హుస్సేన్ సాగ‌ర్ పూర్తిగా నిండిపోయింది.

సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు. గరిష్ఠ నీటి మట్టానికి మరో మీటరు దూరంలో హుస్సేన్‌ సాగర్‌లో నీరు ఉంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో కూకట్‌పల్లి నాలా నుంచి సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే తూముల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana Rains : రాష్ట్రంలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైద‌రాబాద్ జంట జ‌లాశ‌యాలు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌కు కూడా వ‌ర‌ద పోటెత్తింది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 894 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు అన్ని ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

Godavari : భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం..చివరి ప్రమాద హెచ్చరిక జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. చత్తీస్‌ఘడ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండటంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా చురుగ్గా కదులుతుంది. మరో మూడు రోజులు పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి భారీ వర్షాలు పడుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుండటంతో భారీ వానలు పడుతున్నాయి.