కడియం శ్రీహరికి కరోనా…హోం క్వారంటైన్ లో ప్రజాప్రతినిధులు

  • Published By: madhu ,Published On : July 22, 2020 / 09:46 AM IST
కడియం శ్రీహరికి కరోనా…హోం క్వారంటైన్ లో ప్రజాప్రతినిధులు

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి,  MLC కడియం శ్రీహరి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు కలవరపాటుకు గురయ్యారు. ఆయన్ను కలిసిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

కడియం గన్ మెన్, పీఏలు ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం కడియం హోం ఐసోలేషన్ ఉండి చికిత్స పొందుతున్నారు. పాత వరంగల్ జిల్లాను కరోనా కలవర పెడుతోంది. ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతున్నారు.

ఇక వరంగల్ లో ప్రజాప్రతినిధులను కరోనా మహమ్మారి వణికిస్తున్నదని చెప్పచ్చు. పలువురు ప్రజాప్రతినిధులు హోమ్ క్వారెంటైన్ లోనే ఉంటున్నారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇటీవలే ఆయన కొడుకు, కోడలు కూడా వైరస్ బారిన పడ్డారు. వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావు దంపతులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలకు కరోనా వైరస్ సోకింది. వీరు ఆసుపత్రిలో చికిత్స పొంది..వైరస్ నుంచి బయటపడ్డారు. హోం మంత్రి మహమూద్ ఆలీ కూడా కోరుకున్నారు. TRS MLA’sలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, బిగాల గణేష్, భాస్కర్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు కోవిడ్ – 19 బారిన పడ్డారు.