Konda Surekha : నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు బాధించాయి.. షర్మిల, కవిత కూడా స్పందించాలి

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను దేశం మొత్తం ఖండించాలి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు కలిచి వేశాయి. ఒక మహిళగా తోటి మహిళకు జరిగిన..

Konda Surekha : నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు బాధించాయి.. షర్మిల, కవిత కూడా స్పందించాలి

Konda Surekha

Konda Surekha : ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ్ తీవ్రంగా స్పందించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను దేశం మొత్తం ఖండించాలని ఆమె అన్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు తనను కలిచి వేశాయన్నారు. ఒక మహిళగా తోటి మహిళకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. దీనిపై పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరు స్పందించాలని ఆమె అన్నారు.

Amaravathi : రాజధాని అంశంపై సీఎం జగన్ సంచలన ప్రకటన..మళ్లీ బిల్లు తీసుకొస్తాం

రాజకీయాలు… పార్టీల వరకే పరిమితం అవ్వాలి, వ్యక్తిగతంగా కుటుంబాల వరకు వెళ్లొద్దని కొండా సురేఖ హితవు పలికారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా దీనిపై మాట్లాడాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. అటు ఏపీ అసెంబ్లీ ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించకపోవడం బాధేసిందన్నారు.

Blood Flow : శనగలు తింటే శరీరంలో రక్తం పెరుగుతుందా…

తల్లి లాంటి మహిళకు అవమానం జరిగినా మంత్రి కేటీఆర్ కనీసం ట్విట్టర్ లో నైనా స్పందించకపోవడం బాధాకరం అన్నారామె. లక్ష్మీపార్వతి మాటలతో ఆమె మీద గౌరవం పోయిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా శాపనార్థాలు పెట్టడం సరికాదన్న కొండా సురేఖ, సాటి మహిళగా మరో మహిళకు అవమానం జరగొద్దని రోజా కోరుకోవాలన్నారు.

తన భార్యకు రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆమెను కూడా చర్చల్లోకి లాగుతున్నారని చంద్రబాబు వాపోయారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సతీమణి గురించి నీచంగా మాట్లాడారని బాధపడ్డారు. ఆమెకు తన గురించి తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదని అన్నారు.

ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. శాసనసభలో అవమానాలను భరించలేకపోతున్నానని… మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన నేరుగా టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. వెక్కి..వెక్కి..ఏడ్చారు.

ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు చంద్రబాబుకి మద్దతుగా నిలిచారు. ఆయనకు సానుభూతి తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్, హెల్పింగ్ స్టార్ సోనూ సూద్.. అసెంబ్లీ ఘటనను ఖండించారు. చంద్రబాబుని ఫోన్ లో పరామర్శించారు.