శివాలయాలకు శివరాత్రి శోభ..తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శివరాత్రి రోజున ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.

శివాలయాలకు శివరాత్రి శోభ..తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు

Devotees visiting Shiva temples : దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శివరాత్రి రోజున ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులు నదులలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. పరమశివుడి దర్శనంలో మహిళలు నిమగ్నమయ్యారు. భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నీలకంఠుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట.. ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నదుల్లో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు పోటెత్తారు. శివరాత్రికి తెల్లవారుజామునే నదిలో పుణ్య స్నానాలు చేస్తూ పూజలు చేస్తున్నారు భక్తులు. పెద్ద ఎత్తున భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి రావడంతో.. ప్రయాగ్‌రాజ్‌ కిక్కిరిసిపోయింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దివ్యక్షేత్రం శివరాత్రి శోభతో అలరారుతోంది. కోడె మొక్కులతోపాటు ముడుపులు చెల్లించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.