ఇదేం కక్కుర్తి.. పైసా ఖర్చవకుండా ఫ్రీగా ప్రయాణం చేసేందుకు అంబులెన్స్‌కి కాల్

ఇదేం కక్కుర్తి.. పైసా ఖర్చవకుండా ఫ్రీగా ప్రయాణం చేసేందుకు అంబులెన్స్‌కి కాల్

man calls ambulance for free journey: ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే జనాలున్న రోజులివి. ఉచితంగా వస్తుందంటే ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు కొందరు. అలాంటి కోవకే చెందుతాడీ వ్యక్తి. ఇతడి కక్కుర్తి గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఇలాంటోళ్లు కూడా ఉంటారా అని నోరెళ్లబెట్టాల్సిందే. పైసా ఖర్చు అవకుండా ఫ్రీ గా వేరే ఊరికి ప్రయాణం చేసేందుకు ఇతగాడి కన్ను ఏకంగా అంబులెన్స్ మీద పడింది. అంతే, వెంటనే అంబులెన్స్ కి కాల్ చెయ్యడం, అది రాగానే ఎంచక్కా అందులో ఎక్కి కూర్చోవడం, ప్రయాణం చేయడం. ఇదీ ఇతగాడి కక్కుర్తి.

ఫ్రీగా వేరే ఊరికి ప్రయాణం చేసేందుకు ఓ వ్యక్తి పలుమార్లు అంబులన్స్ కు కాల్ చేస్తున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. చార్జీలు పెట్టి ప్రయాణం చేయడం ఇష్టం లేక అతగాడీ పని చేస్తున్నాడు. తనకు ఏ రోగం లేకున్నా అంబులెన్స్ కు కాల్ చేస్తాడు. అంబులెన్స్ వచ్చేలోగా టిప్ టాప్ గా రెడీ అవుతాడు. చేతిలో దుప్పట్లు పెట్టుకుంటాడు. అంబులెన్స్ రాగానే అందులో ఎక్కి కూర్చుంటాడు. పక్క ఊళ్లకు వెళ్లి పని చూసుకుని వస్తాడు. ఇదీ ఇతగాడి తీరు.

ఇది గమనించిన అంబులెన్స్ సిబ్బందికి పిచ్చ కోపం వచ్చింది. అతగాడిని చెడామడ తిట్టేశారు. తమాషాలు చేస్తున్నావా అంటూ కసురుకున్నారు. నాటకాలు ఆడుతున్నావా అని కోప్పడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో అంబులెన్స్ సిబ్బంది ఆ వ్యక్తిని దండించడం ఉంది. ఆ వ్యక్తి ఏమో.. కాళ్లు చేతులు గుంజుతున్నాయని, అందుకే ఇలా కాల్ చేశానని చెప్పడం నవ్వులూ పూయిస్తోంది.

దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ ఐడియా ఏదో బాగుందని కొందరు అంటే, పిచ్చ క్రేజీ అని మరికొందరు, మండిపోతున్న పెట్రోల్ రేట్లకు చక్కని పరిష్కారం అని ఇంకొందరు, నువ్వు మగాడ్రా బుజ్జి అని కొందరు కామెంట్ చేశారు. అదే సమయంలో మండిపడ్డ వాళ్లూ ఉన్నారు. ఇలాంటి వాళ్ల కాళ్లు, చేతులు విరగ్గొట్టి అంబులెన్స్ లో ఎక్కించాలని మండిపడ్డారు.

 

View this post on Instagram

 

A post shared by ??????????? (@dubstelugu2)