ఎన్నికల గజనీ మహ్మద్.. 11 సార్లు ఓటమి.. అయినా పోటీకి సై

గజినీ మహ్మద్‌.. భారతదేశంపై పలుమార్లు దండయాత్ర చేసి ఓటమి పాలయ్యాడు. అయినా పట్టు వదలకుండా మరోమారు యుద్ధం చేసి చివరికి గెలుపు సాధించాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అదే కోవలోకి వస్తాడు. అతడే సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన

ఎన్నికల గజనీ మహ్మద్.. 11 సార్లు ఓటమి.. అయినా పోటీకి సై

Man Contest Elections 11 Times

man contest elections 11 times : గజినీ మహ్మద్‌.. భారతదేశంపై 17సార్లు దండయాత్ర చేసి ఓటమి పాలయ్యాడు. అయినా పట్టు వదలకుండా మరోమారు యుద్ధం చేసి చివరికి గెలుపు సాధించాడు. అలా చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అదే కోవలోకి వస్తాడు. అయితే ఇతడు  ఏ దేశం మీదా యుద్ధాలు చేయలేదు లెండి. ఆయన యుద్ధాల గజినీ మహ్మద్ అయితే.. ఈయన ఎన్నికల గజినీ మహ్మద్.

అతడే సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మర్రి నెహెమ్యా. లోకల్ టు సెంట్రల్… ఎన్నికలు ఏవైనా నేనున్నాంటూ బరిలో నిలుస్తాడు. ఇప్పటికి కౌన్సిలర్‌ నుంచి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు 11సార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అయినా తగ్గడం లేదు. గెలిచే వరకు పోటీ చేస్తానే ఉంటానని స్పష్టం చేశాడు. 72ఏళ్ల వయసులోనూ మరోమారు సాగర్‌ ఉప ఎన్నిక బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు.

నిడమనూరు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో బుధవారం(మార్చి 24,2021) నామినేషన్‌ పత్రాలు వేశాడు మర్రి నెహెమ్యా. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మర్రి నెహెమ్యా.. 1984 నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. తుంగతుర్తి, సూర్యాపేట, చలకుర్తి, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశాడు. ఆ తర్వాత మిర్యాలగూడ, నల్లగొండ లోక్‌ సభ స్థానాలకూ పోటీ చేసి ఓడిపోయినట్లు తెలిపాడు.

2014లో నిర్వహించిన నల్లగొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి 56వేల ఓట్లు సాధించానని తెలిపాడు. తనను గెలిపించే వరకు ఎన్నికల బరిలో నిలుస్తూనే ఉంటానని నెహెమ్యా చెబుతున్నాడు. మరి ఈసారి అయినా అతడి కోరిక నెరవేరుతుందో లేదో చూద్దాం.