Telangana Bandh : ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ బంద్

చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ప్రకటన వెలువడింది.

10TV Telugu News

Maoists call for Telangana bandh : చత్తీస్‌గఢ్‌లోని ఎల్మీడి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఒక ప్రకటన వెలువడింది. దీంతో సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో అని ఏజెన్సీ గ్రామ ప్రజలు భయంభయంగా బతుకుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో టెన్షన్‌ నెలకొంది.

ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మావోయిస్టులు తలదాచుకునేందుకు తెలంగాణవైపు వస్తారనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవాళ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశారు. ములుగు జిల్లా పరిధిలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం అటవీప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నిక…నేటితో ప్రచారానికి తెర

తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల గ్రేహౌండ్స్‌ బలగాలతో పాటు ములుగు జిల్లా పోలీసులు కూడా అడవులను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాహనాల తనిఖీని మరింత ముమ్మరం చేశారు. గొత్తికోయ గ్రామాల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలను కూడా రంగంలోకి దించారు. అటవీ ప్రాంతంపై డ్రోన్‌ కళ్లతో పహారా కాస్తున్నారు. ఇక ల్యాండ్ మైన్లను గుర్తించేందుకు రహదారులను క్షుణ్ణంగా గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు.

×