Mayawati: బీఎస్పీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ పేరును ప్రకటించిన మాయావతి.. కేసీఆర్ గురించి ఏమన్నారంటే?

Mayawati: సరూర్ నగర్ లోని మైదానంలో బీఎస్పీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు మాయావతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ సహా తెలంగాణ బీఎస్పీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Mayawati: బీఎస్పీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ పేరును ప్రకటించిన మాయావతి.. కేసీఆర్ గురించి ఏమన్నారంటే?

Mayawati

Mayawati: బీఎస్పీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ పేరును ప్రకటించారు ఈ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను మాయావతి ఆశీర్వదించారు. ఇవాళ హైదరాబాద్, సరూర్ నగర్ లోని మైదానంలో బీఎస్పీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు మాయావతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ సహా తెలంగాణ బీఎస్పీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సభలో మాయావతి మాట్లాడుతూ… “బహుజన వర్గాలకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరడం లేదు. ఓబీసీ వర్గాల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయలేని నేను మంత్రి పదవిలో ఉండను అని రాజీనామా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన ప్రాధాన్యం కల్పించాను.

ఎన్నికలు జరిగినప్పుడు యువకుల ఓట్లు కొల్లగొట్టడం అలవాటైంది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెబుతుంది. రూ.4 వేలతో కుటుంబం నడుస్తుందా?.. అందుకే ఉద్యోగావకాశాలు కల్పించాం. మేము యూపీలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాం. పేదవారు తీసుకున్న రుణాలు కూడా బీఎస్పీ ప్రభుత్వం కట్టింది.

పట్టణాల్లో ఉండే పేదలకు కూడా సౌకర్యవంతంగా నివసించే ఏర్పాట్లు చేసింది. మా పాలనలో సాదు సంతులకు కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకున్నాం. తెలంగాణలో బీఎస్పీ బలోపేతం అవుతుంటే రాజకీయ దురుద్దేశంతోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి‌‌.. సచివాయానికి అంబేద్కర్ పేరు పెట్టారు.

కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తా అన్నారు. మిమ్మల్ని ఖుషీ చేసేందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ముస్లింలకు ఎలాంటి లబ్ధి జరగడం లేదు. యూపీ తరహాలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తాం. ఎన్నికల్లో గెలిచేందుకు ఆర్థిక బలాన్ని వినియోగించం.

దేశంలో ఎక్కడెక్కడ బీఎస్పీ బలోపేతం అవుతున్నా ఆయా రాష్ట్రాల్లో బలహీన పర్చేందుకు కుట్ర చేస్తున్నారు. మొదట కాంగ్రెస్ అంబేద్కర్ కు భారతరత్న కూడా ఇవ్వలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చాలా సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. మేం ఎన్నిసార్లు అడిగినా భారతరత్న ఇవ్వలేదు.

వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మాకు ఎలాంటి మంత్రి పదవైనా ఇస్తా అన్నారు. మేం అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వాలని కోరాం.. మండలి కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలని కోరాం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఎన్నికల్లో గెలవనివ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకే పని చేస్తుంది. బీఎస్పీ ఏది చెబుతుందో ఆది చేసి చూపిస్తాం.

అందరిలాగా మేం ఎన్నికల ముందే మేనిఫెస్టో విడుదల చేయలేదు. అధికారంలోకి వచ్చాక మా మేనిఫెస్టో అమలు చేశాం. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కృషి చేయాలి. అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి గెలిపించుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. యూపీలో బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చాం.

కానీ, ఈవీఎంలు వచ్చిన తర్వాత ఆ ఓట్లు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదు. తెలంగాణలో ఆదివాసీ, దళితుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎప్పుడు వారు ఆందోళన చేస్తే వారిని అదుపుచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏదైనా వారి సంక్షేమం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఐఏఎస్ అధికారిని బిహార్ లో హత్య చేసిన వ్యక్తిని విడుదల చేసినా తెలంగాణ సీఎం మాట్లాడటం లేదు” అని మాయావతి అన్నారు.

Katasani Rambhupal Reddy : ఎనీ సెంటర్ నేను రెడీ.. దమ్ముంటే రా- మరోసారి లోకేశ్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్