Harish Rao : అవసరం అయితేనే హైదరాబాద్‌కు రండి-హరీష్‌రావు సూచన

రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని.. వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు.

Harish Rao : అవసరం అయితేనే హైదరాబాద్‌కు రండి-హరీష్‌రావు సూచన

Minister Harish Rao

Harish Rao :  రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని.. వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు.  అవసరమైతే తప్ప రోగులను హైదరాబాద్ కు రిఫర్ చేయవద్దని వైద్యులకు సూచించారు.

కోవిడ్ సోకిన గర్భిణిలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వారికోసం ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో ఆపరేషన్ ధియేటర్లు, వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోవిడ్ సోకిన ఇతర పేషెంట్లకు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ ధియేటర్లు, వార్డులు కేటాయించాలని ఆదేశించారు. అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి కోవిడ్ సోకిందనే కారణంతో చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని స్పష్టం చేశారు.

జిల్లా వైద్య అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి ఎప్పటికప్పడు పరిస్ధితులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టేంతవరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, ఆదివారం కూడా పని చేయాలని హరీష్ రావు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.  ప్రతి పీహెచ్‌సీలో  రాత్రి 10 గంటల వరకు వ్యాక్సినేషన్  చేపట్టాలని సూచించారు.
Also Read : Covid in Delhi:కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయి..రెండురోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తాం : వైద్యశాఖా మంత్రి
కోవిడ్ లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్షించాలని…పాజిటివ్ వచ్చిన వారికి కిట్లు ఇవ్వటంతో పాటు వారి ఆరోగ్య పరిస్ధితి తెలుసుకుంటూ వారికి వైద్యం అందించాలని హరీష్ రావు ఆదేశించారు. కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మాట్లాడి మున్సిపల్ సిబ్బందికి, పోలీసు వారికి బూస్టర్ డోస్ వేసేలా సమన్వయంతో పని చేయాలని డీఎంహెచ్ఓలకు  హరీష్ రావు సూచించారు.