Minister KTR : చేనేతకు వెన్నుపోటు పొడిచిన ఏకైక ప్రధాని మోడీ : మంత్రి కేటీఆర్

పాదయాత్ర చేసే బండి సంజయ్ అజ్ఞాని...ఏం తెలియదని విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, కారు కూతలు కూస్తూ పాదయాత్ర చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.

Minister KTR : చేనేతకు వెన్నుపోటు పొడిచిన ఏకైక ప్రధాని మోడీ : మంత్రి కేటీఆర్

Ktr (1)

Minister KTR : చేనేత మీద వెన్నుపోటు పొడిచిన ఏకైక ప్రధాని మోడీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. చేనేతకు జీఎస్టీ విధించి చేనేత కార్మికుల నడ్డి విరిచిన ప్రభుత్వం బీజేపీ అని అన్నారు. సోమవార(మే9,2022) నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం నిర్వహించే పరీక్షలు ఉర్దూలో ఉంటాయి.. అక్కడ ఉన్నప్పుడు లేని బాధ ఇక్కడ ఉంటే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. పిల్లల మనసుల్లో విషం నింపుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి అని సవాల్ విసిరారు. కేంద్రం ఉత్తమ గ్రామ పంచాయతీలు ప్రకటిస్తే అన్ని తెలంగాణ గ్రామాలేనని గుర్తు చేశారు. విషం చిమ్ముడు తప్ప… దమ్ములేని దద్దమ్మలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఎకానమీలో దేశం నాలుగో స్థానంలో ఉందన్నారు.

82కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకున్నామని తెలిపారు. పేద అడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలు ప్రవేశపెట్టిన సంస్కారవంతమైన ప్రభుత్వం తమదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి చదివిస్తున్నామని తెలిపారు. 18,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చామమని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లి చదువు కోవాలనుకునేవాళ్లకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. కృష్ణ జలాల్లో నీటి వాటాను తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

Minister KTR :తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తాం

ఉమ్మడి ఏపీలో కృష్ణా నదిలో 811 టీఎంసీ కేటాయింపులు ఉండేవన్నారు. పునర్విభజన చట్టం సెక్షన్3లో ఇచ్చిన 811 టీఎంసీల లెక్క తేల్చండని కేంద్రాన్ని అడుగుతున్నామని తెలిపారు. 575 టీఎంసీల నీళ్లను తమకు ఇవ్వండని అడుగుతున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ ని కూడా అడిగారు… కానీ కేంద్రం స్పందించట్లేదన్నారు. పాదయాత్ర చేసే బండి సంజయ్ అజ్ఞాని…ఏం తెలియదని విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, కారు కూతలు కూస్తూ పాదయాత్ర చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి అని డిమాండ్ చేశారు. మీకు దమ్ముంటే సాదించండి అని సవాల్ చేశారు.

కర్ణాటకకు అప్పర్ భద్ర జాతీయ హోదా ఇచ్చారని పేర్కొన్నారు. మాటలు చెప్పడం కాదు…జాతీయ హోదా తీసుకుని రావాలన్నారు. కల్వకుర్తి, నెట్టెం పాడు, ప్రాజెక్ట్ లు పూర్తి చేశామని చెప్పారు. 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని… ఇందులో ఒక్క పైసా కేంద్రానిది లేదని స్పష్టం చేశారు. ఇక్కడికి వస్తున్న అమిత్ షా జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నారాయణపేటలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలి.. కానీ, కేంద్రం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. జాతీయ విద్యా సంస్థ ఒక్కటీ కూడా తెలంగాణలో ఏర్పాటు చేయలేదన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని తెలిపారు. కరెంట్ మీటర్ లు పెట్టమని కేంద్రం అంటుందన్నారు.