Minister KTR: తొమ్మిదేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది.. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలి

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Minister KTR: తొమ్మిదేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది.. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలి

minister KTR

Minister KTR: తొమ్మిదేళ్లలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ జీవిస్తున్న ప్రజలకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నా.. వాటి పరిష్కారం కోసం ఎలా కృషి చేస్తున్నామనేది ముఖ్యం అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బేగంపేట్‌లో తొమ్మిది కోట్ల వ్యయంతో నిర్మించిన వైకుంఠదామంను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వైకుంఠధామ నిర్మాణంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. వాటిని ఎదుర్కొని మంచి స్మశాన వాటిక నిర్మాణం చేశామని చెప్పారు. ఎల్బీనగర్‌లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకోసం ఒకేచోట స్మశాన వాటిక ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.

Minister KTR : మోదీ ఆదానీకి మాత్రమే దేవుడు ప్రజలకు కాదు

హైదరాబాద్‌ నగరం విశ్వ నగరంగా మారాలంటే భారీ ఫ్లై ఓవర్లు, మెట్రోలాంటి సౌకర్యాలు, మంచినీళ్ల‌తోపాటు మంచి స్మశాన వాటికలు కూడా అవసరం. గడిచిన తొమ్మిదేళ్లలో హైదరాబాద్ నగరం మనందరం గర్వపడే విధంగా బాగుపడింది. హైదరాబాద్ అభివృద్ధిపై సూపర్ స్టార్ రజనీకాంత్, సినిమా హీరోయిన్ లయ చాలా బాగా చెప్పారు. మన దేశంలో ఉన్నామా? లేక న్యూయార్క్ నగరంలో ఉన్నామా అనే స్థాయిలో హైదరాబాద్ మారిపోయిందని వారు అన్నారు.  గతంలో హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్ కు చాలా తేడా ఉందని వారన్నారు. అయితే, హైదరాబాద్‌లో అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి.. వాటి పరిష్కారం‌కోసం ఎలా కృషి చేస్తున్నాం అనేది ముఖ్యం అని కేటీఆర్ అన్నారు. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం దృష్టి పెట్టి పనిచేస్తుందని, అందులో కొన్నింటిలో చాలా పురోగతి ఉందని అన్నారు.

Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ .. 16మంది అరెస్ట్

ప్రజల అవసరాలు తీర్చే విధంగా మన పనులు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా మేము ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో నాలాల అభివృద్ధికి 985కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తొమ్మిదేళ్లలో మంచినీళ్లు వచ్చాయి. రోడ్లు బాగా అయ్యాయి. ఫ్లైఓవర్లు పూర్తి అవుతున్నాయి. లక్ష డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టాం.. నాలుగు నెలల్లో వాటిని ఇస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రజా రవాణాను మెరుగుపరుస్తున్నామని, ఎయిర్ పోర్టు, మెట్రో పనులు చేపడుతున్నామని, ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం కమిట్‌‍మెంట్‌ను మీరు గుర్తుంచుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.

Minister KTR : హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు : మంత్రి కేటీఆర్

కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. ఆ మాటలు మాకు రావా అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా సాయం చేసిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి జరుగుతున్నా.. కళ్లులేని కబోదుల్లా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. మమ్మల్ని గెలిపించిన ప్రజలకోసం చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నామని అన్నారు. ఐటీ, ఇండస్ట్రీ రంగంలో పెట్టుబడులు భారీగా రావడానికి రాజకీయంగా తెలంగాణ స్థిరత్వంగా ఉండడం కారణం అని మంత్రి తెలిపారు. మంచి ప్రభుత్వం, కేసీఆర్ లాంటి నాయకుడు ఉండడం కారణంగా మౌలిక వసతులపై ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. మంచి నాయకులు మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కొట్టే డైలాగులను చూసి మోసపోవద్దని ప్రజలను కోరుతున్నా. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.