టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను బీజేపీ కాపీ కొట్టింది : మంత్రి కేటీఆర్

  • Published By: bheemraj ,Published On : November 26, 2020 / 08:49 PM IST
టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను బీజేపీ కాపీ కొట్టింది : మంత్రి కేటీఆర్

KTR setires BJP manifesto : బీజేపీ మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి పథకాల ఫోటోలను వాడుకున్నారంటూ ట్వీట్ చేశారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను బీజేపీ కాపీ కొట్టిందన్నారు కేటీఆర్. కాపీ కొట్టడానికి తెలివి ఉండాలంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.



టీఆర్‌ఎస్‌ అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలతో బీజేపీ మేనిఫెస్టో రూపొందించడంపై సెటైర్స్ వేశారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి కార్యక్రమాలైన షీ-టాయిలెట్స్‌, డంపింగ్‌ యార్డు, మహిళా పోలీస్‌స్టేషన్‌ ఫొటోలతో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్‌ చేసింది.



టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేసిన పనుల ఫొటోలను మీ మేనిఫెస్టోలో పెట్టుకోవడాన్ని కాంప్లిమెంట్‌గా తీసుకుంటామన్నారు. పోయినసారి ఏం చేశాం..ఇప్పుడేం చేస్తామో తాము చెబుతామని తెలిపారు. ఐదేళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో ఆలోచన చేయాలంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.