KTR On Modi : దగాకోరు మాటలు తప్ప భయపెట్టడం తప్ప ఎనిమిదేళ్లలో మోదీ చేసిందేమీ లేదు-మంత్రి కేటీఆర్

పచ్చి దగాకోరు మాటలు తప్ప బీజేపీ కానీ ప్రధాని మోదీ కానీ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఐటీ సంస్థలను ప్రధాని మోదీ వేట కుక్కలా వాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

KTR On Modi : దగాకోరు మాటలు తప్ప భయపెట్టడం తప్ప ఎనిమిదేళ్లలో మోదీ చేసిందేమీ లేదు-మంత్రి కేటీఆర్

KTR On Modi : టెన్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ, ప్రధాని మోదీలపై ఆయన నిప్పులు చెరిగారు. పచ్చి దగాకోరు మాటలు తప్ప బీజేపీ కానీ ప్రధాని మోదీ కానీ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఐటీ సంస్థలను ప్రధాని మోదీ వేట కుక్కలా వాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

”రూ.400 ఉన్న సిలిండర్ రూ.1200 అయ్యింది నరేంద్ర మోదీ నాయకత్వంలో. మీటర్ల పెడతామని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ రైతుని మీటర్లు పెట్టి పొట్ట కొడతాను అంటే ఎందుకు సపోర్ట్ చేయాలి బీజేపీని. యువతను మోసం చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అసలు ఉద్యోగాల ఊసే లేదు. రూ.2వేల పెన్షన్ ఇస్తానని చెప్పి రూ.75 పైసలు ఇస్తే ఎలా ఉంటుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణ యువత నైరాశ్యంలో ఉంది. అలా ఈ వర్గం ఆ వర్గం అని కాదు. ప్రతీ వర్గం కూడా నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆగ్రహంగా ఉంది. ఎనిమిదేళ్లలో చేసిందేమీ లేదు. బ్లాక్ మనీ తెస్తా అన్నారు. రూ.15లక్షలు ఇస్తానన్నారు. ఇవేవీ జరగలేదు. తెలంగాణ ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ పలానా పని చేశామని చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ బలహీనపడటం వల్ల వచ్చిన గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్ని అందిపుచ్చుకోవాలనే ఆరాటంలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ బలహీనంగా మారింది కనుక అది వారికి బలంగా మారింది” అని కేటీఆర్ అన్నారు.

”ఎనిమిదేళ్లలో 9 ప్రభుత్వాలు కూల్చారు నరేంద్ర మోదీ. ఇదేం పద్దతి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నడపనివ్వకుండా నా దగ్గర సంస్థలు ఉన్నాయి. వాటిని వేట కుక్కల్లా వాడతా. సీబీఐ, ఐటీ, ఈడీని నా ఆధీనంలో పెట్టుకుని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, నరేంద్ర మోదీ రాజ్యాంగమే నడవాలంటే ఎలా? వీళ్లందరూ నేడు ఆడించినట్లు ఆడాలి, వీళ్లతో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తా. భయపెట్టి కేసులు పెట్టి ప్రలోభ పెట్టి ఏదైనా చేసి నా దారిలోకి తెచ్చుకుంటా. ఇదీ మోదీ కుతంత్రం. భయపడే వాళ్లు భయపడొచ్చు. కానీ, టీఆర్ఎస్ అలాంటి వాటికి భయపడదు. మేము బానిసలం కాదు. గుజరాతోళ్ల చెప్పులు మోయాల్సిన కర్మ తెలంగాణ బిడ్డలకు లేదు. ప్రజలు వద్దన్న నాడు ఇంటికి పోతాం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పని చేస్తాం. అంతేకానీ చిల్లరమల్లర రాజకీయాలకు, బెదిరింపులకు భయపడే వాడు టీఆర్ఎస్ లో లేడు” అని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు.