TRS Bhavan : ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం పనులు వేగవంతం

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను శుక్రవారం నాడు మంత్రి వేముల పరిశీలించారు. వసంత్ విహార్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ మరో ముందడుగు పడింది.

TRS Bhavan : ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం పనులు వేగవంతం

Delhi Trs Bhavan

TRS Bhavan :  మఘలో పుట్టి పుబ్బలో కలుస్తుంది అని ఎగతాళి చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కేసిఆర్ నాయకత్వంలో నేడు యావత్ తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేల దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున పార్టీ కార్యాలయం నిర్మించుకుంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇంతటి చారిత్రాత్మక, బృహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను శుక్రవారం నాడు మంత్రి వేముల పరిశీలించారు. వసంత్ విహార్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ మరో ముందడుగు పడింది.ప్రత్యేక పూజలు చేసి నిర్మాణపనులకు మంత్రి శ్రీకారం చుట్టారు.లోవర్ గ్రౌండ్ త్రవ్వకం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.పుటింగ్ పనులు ప్రారంభం కోసం ఈ రోజు ముగ్గు పోశారు. మిగతా పనులు త్వరలో పూర్తి చేయనున్నారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు భవన నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించిన అనంతరం వర్క్ ఏజెన్సీ‌తో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన నిర్మాణ పనులు జరగాలని మంత్రి ఆదేశించారు. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు వేగంగా.. అలాగే నాణ్యతతో జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Also Read :Rahul Gandhi : కేరళలోని రాహుల్ గాంధీ ఆఫీసుపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడి