CM KCR Warning : మీకు భవిష్యత్తు ఉండదు.. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులెవరూ ప్రలోభాలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.

CM KCR Warning : మీకు భవిష్యత్తు ఉండదు.. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

CM KCR Warning : టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులెవరూ ప్రలోభాలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరేం చేసినా తనకు సమాచారం అందుతుందన్నారు. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. జాగ్రత్త అంటూ ఓవైపు వార్నింగ్ ఇచ్చారు, మరోవైపు అలర్ట్ చేశారు, ఇంకోవైపు సమరశంఖం పూరించారు గులాబీ బాస్ కేసీఆర్.

ఇక, తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీలోకి రావాలంటూ ఒత్తిడి తెచ్చారని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా..ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు.

Also Read : CM KCR On BJP : బీజేపీలో చేరాలని కవితపై ఒత్తిడి తెచ్చారు, జగన్‌ని దెబ్బకొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు-సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఇదే సమావేశంలో మునుగోడు ఫలితాలపైనా సమీక్ష జరిపారు కేసీఆర్. మునుగోడులో మెజార్టీపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. మునుగోడులో సరిగ్గా పనిచేయని మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. కనీసం ఐదుగురు మంత్రులు ఇంఛార్జ్‌లుగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ వచ్చింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి 85వేలకు పైగా ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేవలం 10వేల మెజార్టీతో గెలవడంతో.. తమకు మెజార్టీ ఇంత స్థాయిలో తగ్గుతుందని ఊహించలేకపోయామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫలితాలు వెలువడిన రోజే ప్రకటించారు.

Also Read : KCR On Early Elections : ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ.. పార్టీ నేతలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు

మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బీజేపీ రోజురోజుకూ బలపడుతోందనే సంకేతం వచ్చిందని.. దీంతో రెండు పార్టీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా నువ్వా నేనా అనే వాతావరణం ఏర్పడిందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.