MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ అనుబంధ ఛార్జిషీట్లో ఎమ్మెల్సీ కవిత పేరు లేదు

డిసెంబరు 11న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ప్రశ్నించింది సీబీఐ.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ అనుబంధ ఛార్జిషీట్లో ఎమ్మెల్సీ కవిత పేరు లేదు

MLC Kavitha

MLC Kavitha – Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ (CBI) అనుబంధ ఛార్జిషీట్లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత పేరు లేదు. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీటును ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కవిత కొన్ని వారాల క్రితం ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఆమె ఫోన్లను కూడా ఈడీకి అప్పగించారు.

కోర్టులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయగా అందులో కవిత పేరు ఎక్కడా కనపడలేదు. ఏప్రిల్ 25న సీబీఐ దాదాపు, 5,700 పేజీలతో అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. అనంతరం, డిసెంబరు 11న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ప్రశ్నించింది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది.

ఇప్పటివరకు ప్రశ్నించిన 89 మంది వివరాలను తాజా ఛార్జిషీట్లో సీబీఐ ప్రస్తావించింది. కవిత పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కవితను సీబీఐతో పాటు ఈడీ కూడా పలుసార్లు ప్రశ్నించింది. అరుణ్ పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించారు. కవిత స్టేట్ మెంట్ ను ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద రికార్డు చేసింది.

సౌత్ గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా ఈడీ చెప్పింది. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్ర,100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారాలతో పాటు నిందితులతో సంబంధాలు, డీలర్ కమిషన్ పెంచడం వంటి వాటిపై కొన్ని వారాల క్రితం ఈడీ కవితను ప్రశ్నించింది.

Arvind Kejriwal: ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం: హైదరాబాద్‌లో కేజ్రీవాల్