Munugode Bypoll: కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. రాజగోపాల్ రెడ్డికి కూసుకుంట్ల షేక్ హ్యాండ్

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల షేక్ హ్యాండ్ ఇచ్చారు. మరోవైపు, ఒక్కో రౌండ్లో ఒక్కో పార్టీరి ఆధిక్యం దక్కుతుండడంతో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు రౌండ్లు ముగిశాయి.

Munugode Bypoll: కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. రాజగోపాల్ రెడ్డికి కూసుకుంట్ల షేక్ హ్యాండ్

Munugode ByPoll

Munugode Bypoll: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మరోవైపు, ఒక్కో రౌండ్లో ఒక్కో పార్టీరి ఆధిక్యం దక్కుతుండడంతో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు రౌండ్లు ముగిశాయి.

టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ పార్టీ 334 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ప్రతి రౌండుకు ఫలితాల సరళి మారుతుండడంతో మిగిలిన రౌండ్ల ఫలితాలు ఎలా ఉండనున్నాయన్న ఆసక్తి నెలకొంది. పోటీ మొత్తం టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉండడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి వెళ్లిపోయారు.

ఇక కేఏ పాల్ కు ప్రజాశాంతి పార్టీకి తొలి రౌండ్ లో 34 ఓట్లు మాత్రమే వచ్చాయి. తాను కోర్టుకు వెళ్తానని కేఏ పాల్ చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, నేటి ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించడం గమనార్హం.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..