Karimnagar : వికటించిన నాటువైద్యం..

ఈ క్రమంలో సున్నితమైన ప్రదేశంలో నరాలపై బలంగా రుద్ది... టవల్‌ మెడకు కట్టి గట్టిగా లాగడంతో బాధితుడు మరింత అనారోగ్యం పాలయ్యాడు. ప్రస్తుతం మెడలు తిప్పలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యాడు.

Karimnagar : వికటించిన నాటువైద్యం..

Karimnagar

Karimnagar : కరీంనగర్‌లో నాటువైద్యం వికటించింది. మెడనొప్పితో బాధపడుతున్న యువకుడికి నాటు వైద్యుడు వింత వైద్యం చేశాడు. దీంతో రోగం నయం ఏమోగానీ…. మరింత నొప్పితో బాధితుడు సాయి విలవిలలాడుతున్నాడు. సాయి అనే యువకుడికి మెడలు పట్టుకోవడంతో వారం క్రితం అలుగునూర్ చౌరస్తాలో ఎలబోతారం పేరిట నాటువైద్యం సెంటర్‌ను సంప్రదించాడు బాధితుడు సాయి.

ఈ క్రమంలో సున్నితమైన ప్రదేశంలో నరాలపై బలంగా రుద్ది… టవల్‌ మెడకు కట్టి గట్టిగా లాగడంతో బాధితుడు మరింత అనారోగ్యం పాలయ్యాడు. ప్రస్తుతం మెడలు తిప్పలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. మెడ భాగంలో వాపు రావడంతో నొప్పి భరించలేకపోతున్న విలవిలలాడుతున్నాడు.

Baby Boy Died : మూఢ నమ్మకంతో నాటువైద్యం- చిన్నపేగు తెగి చిన్నారి మృతి

నాటు వైద్యానికి గుర్తింపు లేకపోయినా కొంతమంది వైద్యసేవ పేరిట సెంటర్లు నడుపుతున్నారు. పైగా ఎంబీఏ చదివిన రాజ్‌కుమార్‌.. కరీనంగర్‌ అలుగునూర్‌ చౌరస్తాలో ఎలబోతారం వైద్యసేవ పేరిట నాటువైద్యం చేస్తున్నాడు. అయితే తాను చేసిన వైద్యం సరైందే అని నాటు వైద్యుడు రాజ్‌కుమార్‌ సమర్థించుకుంటున్నాడు.